ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అర్ధరాత్రి విద్యుతపై రైతుల ఆగ్రహం

ABN, First Publish Date - 2022-01-24T04:45:14+05:30

పగటి పూట వ్యవసాయ బోరుబావులకు విద్యుత సరఫరా చేయాలని రైతులు ఆదివారం రాత్రి గడివేముల సబ్‌స్టేషన వద్ద ఆందోళనకు దిగారు.

గడివేముల సబ్‌ స్టేషన ఎదుట ఆందోళన.. అధికారుల హామీతో విరమణ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గడివేముల విద్యుత సబ్‌స్టేషన వద్ద ఆదివారం రాత్రి ఆందోళన చేస్తున్న రైతులు


గడివేముల, జనవరి 23: పగటి పూట వ్యవసాయ బోరుబావులకు విద్యుత సరఫరా చేయాలని రైతులు ఆదివారం రాత్రి గడివేముల సబ్‌స్టేషన వద్ద ఆందోళనకు దిగారు. ఎ.గ్రూపు ఫీడర్‌కు అర్ధరాత్రి 12 నుంచి (సోమవారం) నుంచి ఉదయం 9 గంటల వరకు విద్యుత సరఫరా చేస్తామని అధికారులు గ్రూపులో మెసేజ్‌ పెట్టడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఫీడర్‌లో ఉన్న గడివేముల, కొరపొలూరు, సోమాపురం, బిలకలగూడురు గ్రామాల్లో మిర్చి, మొక్కజొన్న, పత్తి, మినుము పంటలు సాగు చేశామన్నారు. అర్ధరాత్రి విద్యుత ఇస్తే తీవ్ర ఇబ్బందులు పడతామన్నారు. పగటి పూట విద్యుత సరఫరా చేయాలని కోరారు. పగటి పూట కరెంట్‌ ఇస్తామని హామీ ఇచ్చేంత వరకు రైతులు ధర్నాను కొనసాగించారు. విద్యుత ఏఈ రంగరాజు సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. వారి సూచన మేరకు సోమవారం వేకువ జామున 3 నుంచి విద్యుత సరఫరా చేస్తామని రైతులకు తెలిపారు. సోమవారం ఉన్నతాధికారులు రైతులతో చర్చించి మంగళవారం నుంచి విద్యుత సరఫరా వేళలను నిర్ణయిస్తామని తెలిపారు. దీంతో రైతులు ధర్నాను విరమించారు. 


Updated Date - 2022-01-24T04:45:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising