ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సీఎం జగన్‌ చెప్పినవన్నీ అబద్ధాలే

ABN, First Publish Date - 2022-08-18T05:30:00+05:30

స్వాతంత్య్ర దినోత్సవంలో ముఖ్యమంత్రి జగన్‌ చెప్పినవన్నీ అబద్ధాలేనని పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ నర్రెడ్డి తులసిరెడ్డి అన్నారు.

సమావేశంలో మాట్లాడుతున్న తులసిరెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నంద్యాల (నూనెపల్లె), ఆగస్టు 18: స్వాతంత్య్ర దినోత్సవంలో ముఖ్యమంత్రి జగన్‌ చెప్పినవన్నీ అబద్ధాలేనని పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ నర్రెడ్డి తులసిరెడ్డి అన్నారు. నంద్యాలలోని జిల్లా కాంగ్రెస్‌ కమిటీ కార్యాలయంలో గురువారం డీసీసీ అధ్యక్షుడు లక్ష్మీనరసింహయాదవ్‌ అధ్యక్షతన నాయకుల సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన తులసిరెడ్డి మాట్లాడుతూ వజ్రోత్సవాలు అనే అచ్చమైన తెలుగు పదాన్ని ఉచ్ఛరించలేని జగన్‌ మనకు ముఖ్యమంత్రిగా ఉండడం దౌర్భాగ్యమని అన్నారు. మేనిఫెస్టో తయారు భగవద్గీత, ఖురాన్‌, బైబిల్‌ అని మేనిఫెస్టోలో పేర్కొన్న అంశాలలో 95శాతం అమలు చేశామని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. సీఎం వ్యాఖ్యలు ప్రతిష్ఠాత్మకంగా చెప్పుకునే నవరత్నాలు పూర్తిగా అమలులో లేవని ఆరోపించారు. సంక్షేమ పథకాల గురించి సొంత డబ్బా కొట్టుకోవడమే తప్ప రాష్ట్ర ఎక్కడా అభివృద్ధి జరగడం లేదని అన్నారు. పేదలపై చిత్తశుద్ధి ఉంటే మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా మద్యపాన నిషేధాన్ని అమలు చేయాలని అన్నారు. కాంగ్రెస్‌ నాయకులు పఠాన్‌ హబీబ్‌ఖాన్‌, ఫరూక్‌, చింతలమోహన్‌రావు, నరసింహారెడ్డి, సుబ్రమణ్యశర్మ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-08-18T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising