ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘పాత జీతాలే ఇవ్వాలి’

ABN, First Publish Date - 2022-01-29T05:05:42+05:30

ఉద్యోగ, ఉపాధ్యాయులకు పాత జీతాలనే చెల్లించాలని ఆంధ్రప్రదేశ్‌ టీచర్స్‌ గిల్డ్‌ (ఏపీటీజీ) నగర శాఖ శుక్రవారం డిమాండ్‌ చేసింది.

సి.బెళగల్‌ తహసీల్దార్‌కు వినతి పత్రం ఇస్తున్న ఉద్యోగులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కర్నూలు(ఎడ్యుకేషన్‌), జనవరి 28: ఉద్యోగ, ఉపాధ్యాయులకు పాత జీతాలనే చెల్లించాలని  ఆంధ్రప్రదేశ్‌ టీచర్స్‌ గిల్డ్‌ (ఏపీటీజీ) నగర శాఖ శుక్రవారం డిమాండ్‌ చేసింది. శుక్రవారం కర్నూలు ఎంఈవో మౌలాలికి వినతి పత్రం అందజేశారు. సంఘం నగర శాఖ అధ్యక్షుడు రాందాస్‌, నాయకులు హేమంత్‌ కుమార్‌ రెడ్డి, మహేశ్వరరెడ్డి, గోపాల్‌ రెడ్డి, సంజీవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

కర్నూలు(అర్బన్‌): చీకటి జీవోలను రద్దు చేయాలని పీఆర్‌సీ సాధన సమితి నాయకులు డిమాండ్‌ చేశారు. శుక్రవారం నగర పాలక సంస్థ మేనేజర్‌ చిన్న రాముడును కలిసి ఉపాధ్యాయ సంఘాల నాయకులు వినతి పత్రం అందించారు. ఈ. రాముడు, పి. భాస్కర్‌,  ఉపాధ్యాయులు మిన్నేల్ల, దావుద్‌, నిర్మల్‌ కుమార్‌, బీసి. వెంగన్న, ఎస్‌. ఇబ్రహీం, అజీజ్‌ పాల్గొన్నారు.


డోన్‌: పెండింగ్‌లో ఉన్న ఐదు డీఏలతో కూడిన పాత జీతాలను చెల్లించాలని ఎస్టీయూ నాయకులు డిమాండ్‌ చేశారు. డోన్‌ ఎంఈవో ఎ.ప్రభాకర్‌కు వినతి పత్రం అందజేశారు. ఎస్టీయూ జిల్లా నాయకుడు ఇక్బాల్‌, మౌలాలి, హుశేన్‌, భాస్కర్‌, వాణి, శ్రీనివాస కుమార్‌ తదితరులు పాల్గొన్నారు. తహసీల్దార్‌ కార్యాలయంలో రెవెన్యూ సిబ్బంది, వీఆర్వోలు చెల్లించాలని డిప్యూటీ తహసీల్దార్‌ సత్యదీప్‌కు వినతి పత్రం అందజేశారు. 


బేతంచెర్ల: బేతంచెర్లలో ఎంపీడీవో వెంగన్నకు ఎస్టీయూ నాయకులు వినతిపత్రం అందజేశారు. ఎస్టీయూ రాష్ట్ర కౌన్సిలర్‌ ఆజాంబేగ్‌ పాల్గొన్నారు.


మద్దికెర: రాష్ట్ర ప్రభుత్వం పీఆర్‌సీ ప్రకారం పెంచిన కొత్త జీతాలు కాకుండా పాత జీతాలు ఇవ్వాలని డిప్యూటీ తహసీల్దార్‌ ఎజాద్‌ అహమ్మద్‌, మండల వీఆర్వోల సంఘం అధ్యక్షుడు రంగస్వామి డిమాండ్‌ చేశారు. శుక్రవారం తహసీల్దార్‌ కార్యాలయం ముందు ధర్నా చేపట్టి తహసీల్దార్‌ నాగభూషణంను కలిసి వినతిపత్రం అందజేశారు. జూనియర్‌ అసిస్టెంట్‌ రామదాసు, వీఆర్వోలు గోవిందప్ప, రహిమాన్‌, రషీద్‌, మల్లికార్జున, శివన్న, రంగప్ప, పక్కీరప్ప తదితరులు పాల్గొన్నారు. 


సి.బెళగల్‌: కొత్త జీతాలు వద్దు.. పాత జీతాలే ఇవ్వాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్‌ చేశాయి. సి.బెళగల్‌లోని తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట శుక్రవారం ధర్నా చేపట్టారు. అనంతరం తహసీల్దార్‌ శిశంకర్‌నాయక్‌ వినతి పత్రం అందజేశారు.  ఉద్యోగ సంఘాల నాయకులు రఫి, ఖాజా, మద్దిలేటి, వీఆర్వోలు, గ్రామ పంచాయతీల కార్యదర్శులు, గ్రామ సచివాలయ సిబ్బంది ఉన్నారు.

Updated Date - 2022-01-29T05:05:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising