ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉద్యోగులు మేల్కొనాలి

ABN, First Publish Date - 2022-01-29T05:09:57+05:30

ఉద్యోగులు ఇప్పటికైనా మేల్కొనాలని మాజీ మంత్రి, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమా అఖిలప్రియ అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  1. మాజీ మంత్రి అఖిలప్రియ


ఆళ్లగడ్డ, జనవరి 28: ఉద్యోగులు ఇప్పటికైనా మేల్కొనాలని మాజీ మంత్రి, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమా అఖిలప్రియ అన్నారు. శుక్రవారం ఆమె ఫోన్‌లో మాట్లాడుతూ అర్థరాత్రి వదిలిన పీఆర్సీ జీవోలను రద్దు చేయాలంటూ ఉద్యోగులు చేపట్టిన ఉద్యమాన్ని, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పక్కదారి పట్టించేందుకే తెరపైకి కొత్త జిల్లాలను సీఎం జగన్‌ తెచ్చారని ఆరోపించారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఉద్యోగులను చంద్రబాబునాయుడు ఇలా రోడ్డుపైకి తేలేదని గుర్తు చేశారు.  ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే తమకు న్యాయం జరుగుతుందో ఉద్యోగులు ఆలోచించుకోవాల్సిన తరుణం ఆసన్నమైందన్నారు. గతంలో రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ అధికార వైసీపీ మాదిరిగా రివర్స్‌ పీఆర్సీ చేయలేదన్నారు. ఉద్యోగులకు టీడీపీ అండగా ఉంటుందని, భవిష్యత్తులో రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వస్తుందని అన్నారు. రాష్ట్రంలో ప్రజలను రహదారుల సమస్య వేధిస్తోందని, విద్యుత్‌ చార్జీల పెంపుదల, రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు లేవని, రైతుల నుంచి కొనుగోలు చేసిన మొక్కజొన్న, వరి పంటల దిగుబడులకు నేటికీ డబ్బులు చెల్లించలేదని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం జనాభా లెక్కింపు తర్వాతే జిల్లాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించినప్పటికీ అప్పటికప్పుడు  జిల్లాల ఏర్పాటు ప్రక్రియ చేపట్టడం ఉద్యోగుల ఉద్యమాన్ని నీరుగార్చడమేనన్నారు. జిల్లాల ఏర్పాటుకు నిధులు ఇవ్వలేమని కేంద్రం తేల్చి చెప్పినప్పటికీ ప్రకటించడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. ఇప్పటికైనా ప్రజలు, ఉద్యోగులు ఒక్కసారి అవకాశమివ్వండంటూ అధికారంలోకి వచ్చిన సీఎం జగన్‌కు బుద్ధి చెప్పాలని ఆమె కోరారు.



Updated Date - 2022-01-29T05:09:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising