ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఓటీఎస్‌కు స్పందన కరువు

ABN, First Publish Date - 2022-01-29T04:48:20+05:30

ఓటీఎస్‌కు స్పందన కరువైంది. పొదుపు సంఘాల వీవోలు, హౌసింగ్‌ అధికారులు లబ్ధిదారుల ఇళ్ల వద్ద కు వెళ్లి ఓటీఎస్‌ కింద నగదు చెల్లిస్తే మీకు ప్రభుత్వమే రిజిస్టర్‌ చేయిస్తుందని చెబుతు న్నప్పటికీ ముందుకు రావడం లేదు.

ఓటీఎస్‌పై అవగాహన కల్పిస్తున్న అధికారులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

టార్గెట్లతో ఇబ్బంది పడుతున్న అధికారులు, సిబ్బంది

కొత్తపల్లి, జనవరి 28: ఓటీఎస్‌కు స్పందన కరువైంది. పొదుపు సంఘాల వీవోలు, హౌసింగ్‌ అధికారులు లబ్ధిదారుల ఇళ్ల వద్ద కు వెళ్లి ఓటీఎస్‌ కింద నగదు చెల్లిస్తే మీకు ప్రభుత్వమే రిజిస్టర్‌ చేయిస్తుందని చెబుతు న్నప్పటికీ ముందుకు రావడం లేదు. టీడీపీ నాయకులు తమ ప్రభుత్వం వస్తే ఉచితంగా రిజిస్ట్రేషన్లు చేయిస్తుందని చెబుతుండటంతో ఓటీఎస్‌ విధానానికి లబ్ధిదారులు ముందుకు రావడం లేదు. దీంతో కొత్తపల్లి మండలంలో 1986 నుంచి 2011 వరకు 5689 మంది హౌసింగ్‌ లబ్ధిదారులు ఉండగా నేటికి 691 మం ది మాత్రమే ఓటీఎస్‌ విధానానికి ముందుకు వచ్చారు. ఇదిలా ఉంటే ఈ నెల 25 నుంచి ఫిబ్రవరి 5వ తేదీ వరకు ప్రభుత్వం ప్రత్యే కంగా ఓటీఎస్‌ మేళా ప్రకటించింది. వీటిలో వారం రోజుల్లో 600 మంది లబ్ధిదారుల నుం చి ఓటీఎస్‌ కింద నగదు చెల్లింపులు చేయా లని ప్రభుత్వం టార్గెట్‌ పెట్టింది. అయితే మొదటి రోజు శుక్రవారం కేవలం 23 మంది లబ్ధిదారులు మాత్రం ఓటీఎస్‌ కింద నగదు చెల్లించినట్లు అధికారులు చెబుతున్నారు. ఏదేమైనా ప్రభుత్వం ప్రకటించిన ఓటీఎస్‌ విధానానికి క్షేత్రస్థాయిలో లబ్ధిదారులు ముందుకు రాకపోవడంతో అధికారులు, సిబ్బందికి తల నొప్పిగా మారిందని చెప్పవచ్చు.

Updated Date - 2022-01-29T04:48:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising