ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రూ.448 కోట్లతో నాడు-నేడు పనులు

ABN, First Publish Date - 2022-03-23T05:42:28+05:30

జిల్లాలోని 1,116 పాఠశాలల ఆధునికీకరణకు నాబార్డు కింద రూ.448 కోట్లతో రెండో విడత నాడు-నేడు పనులు చేస్తున్నట్లు జిల్లా సమగ్ర శిక్ష అదనపు ప్రాజెక్టు కో-ఆర్డినేటర్‌ వేణుగోపాల్‌ తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  1. జిల్లా సమగ్ర శిక్ష అదనపు ప్రాజెక్టు కో-ఆర్డినేటర్‌


చాగలమర్రి, మార్చి 22: జిల్లాలోని 1,116 పాఠశాలల ఆధునికీకరణకు నాబార్డు కింద రూ.448 కోట్లతో రెండో విడత నాడు-నేడు పనులు చేస్తున్నట్లు జిల్లా సమగ్ర శిక్ష అదనపు ప్రాజెక్టు కో-ఆర్డినేటర్‌ వేణుగోపాల్‌ తెలిపారు. మంగళవారం చాగలమర్రి గ్రామంలోని జడ్పీ బాలుర, బాలికల, కస్తూర్బా పాఠశాల, కళాశాలలను సందర్శించారు. ఆయా పాఠశాలలో జరుగుతున్న నాడు-నేడు పనులను పరిశీలించారు. కసూర్బా పాఠశాలలో ప్రపంచ జల దినోత్సవం సందర్భంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాడు-నేడు పనులు కేవలం పేరెంట్స్‌ కమిటీల ద్వారానే చేయిస్తున్నామన్నారు. జిల్లాలో రెండో విడత 1,749 పాఠశాలల అదనపు తరగతి గదుల నిర్మాణాలు చేపట్టనున్నట్లు తెలిపారు. అనంతరం బాలికల పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. ఆయన వెంట సమగ్ర శిక్ష ఈఈ కర్రెన్న, జీసీడీవో లలితకుమారి, అలెక్సో శ్రీనివాసులు, ఎంఈవో అనూరాధ, ఎస్‌వో అబీమున్నీసా, హెచ్‌ఎంలు కోటయ్య, విజయలక్ష్మి ఉన్నారు. 



Updated Date - 2022-03-23T05:42:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising