ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దేశాన్ని అమ్మేసే ప్రక్రియ బీజేపీ చేస్తోంది: Sailajanath

ABN, First Publish Date - 2022-02-02T19:43:25+05:30

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ దేశ స్థూల వ్యవస్థలను ప్రైవేట్‌పరం చేశారని ఏపీసిసి అధ్యక్షుడు శైలజానాథ్ అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కర్నూలు: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ దేశ స్థూల వ్యవస్థలను ప్రైవేట్‌పరం చేశారని ఏపీసిసి అధ్యక్షుడు శైలజానాథ్ అన్నారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ దేశంలో ఆదాని గ్రూప్ భారీగా పెరిగిపోయిందని, అంబానిని కూడా మించిపోయిందని తెలిపారు. అటవీ ప్రాంతాలను కూడా ప్రైవేట్ కంపెనీలకు ఇస్తున్నారని మండిపడ్డారు. దేశాన్ని అమ్మేసే ప్రక్రియ బీజేపీ చేస్తోందని విమర్శించారు. పేదలు అంటే మోడీకి చిన్న చూపన్నారు. ఎన్‌ఆర్‌జిఎస్ స్కీంకి బడ్జెట్‌లో డబ్బులు తగ్గించారని తెలిపారు. ఏపీ నుంచి ఎన్నికైన ఎంపీలు ఏమి చేస్తున్నారని ప్రశ్నించారు. బడ్జెట్‌లో ఏపీకి అరకొర కేటాయింపులు జరిగాయని ఆయన విమర్శించారు.


ఏపీకి కాంగ్రెస్ హయాంలో ఇచ్చిన కొన్ని స్కీంలను ఇప్పుడు ఇచ్చారన్నారు. ఏపీకి బుందేల్ ఖండ్ తరహా ప్యాకేజీ ఎక్కడ పోయిందని ప్రశ్నించారు. విశాఖ రైల్వే జోన్ విషయం ఏమయిందన్నారు. ప్రజలు దేశ భక్తి ముసుగు వేసుకున్న దేశ ద్రోహులను ఎన్నుకున్నారని వ్యాఖ్యానించారు. ఆదాని, అంబానీ దయాదాక్షిణ్యాలపై బ్రతకాల్సిందే అని అన్నారు. నదుల అనుసంధానం రాష్ట్రాలతో మాట్లాడకుండా ఏ విధంగా నిర్ణయం తీసుకుంటారని నిలదీశారు. బడ్జెట్లో జరిగిన అన్యాయంపై ముఖ్యమంత్రి కనీసం నోరు కూడా విప్పలేదన్నారు. ఉద్యోగులు చేస్తున్న పోరాటానికి కాంగ్రెస్ పార్టీ మద్దతుగా ఉంటుందని శైలజానాథ్ స్పష్టం చేశారు. 

Updated Date - 2022-02-02T19:43:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising