ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పోలీసులపై మానవహక్కుల సంఘానికి ఫిర్యాదు ?

ABN, First Publish Date - 2022-05-22T06:11:49+05:30

ఆళ్లగడ్డ పట్టణ పోలీసులపై మానవ హక్కుల సంఘానికి ఓ బాలిక ఫిర్యాదు చేసింది. మార్చి 21న ఆళ్లగడ్డ పట్టణంలోని ఆర్టీసీ బస్టాండులో చోరి జరిగింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆళ్లగడ్డ, మే 21: ఆళ్లగడ్డ పట్టణ పోలీసులపై మానవ హక్కుల సంఘానికి ఓ బాలిక ఫిర్యాదు చేసింది. మార్చి 21న ఆళ్లగడ్డ పట్టణంలోని ఆర్టీసీ బస్టాండులో చోరి జరిగింది. ఈ కేసుకు సంబంధించి ఇద్దరు మహిళలను పట్టణ పోలీసులు అరెస్టు చేశారు.  వీరిద్దరు పట్టణ పోలీసుల కళ్లు కప్పి పారిపోయారు. వీరిలో ఆత్మకూరు మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక ఉందని, ఆమెను అరెస్టు చేసి తీసుకు వచ్చేందుకు పట్టణ పోలీసులు ఈ నెల 19న అక్కడకు వెళ్లారు. బాలిక సొంత పనుల మీద దోర్నాలకు వెళ్తుండగా పోలీసులు ఆటోను వెంబడించి ఆమెను అదుపులోకి తీసుకొని రెండు చేతులను వెనక్కి కట్టేసి, మహిళా పోలీసు లేకుండా ఇద్దరు పురుష కానిస్టేబుళ్ల మధ్య కూర్చోబెట్టుకొని ఆళ్లగడ్డకు తీసుకువచ్చారు. ఈ విషయం ప్రసార మాధ్యమాల్లో ప్రసారం కావడంతో అదే రోజున పట్టణ  ఎస్‌ఐ తన జీపులో కూర్చోబెట్టుకొని బాలికను స్వగ్రామంలో వదిలేసి వచ్చారు. ఇది  లా ఉండగా తన పట్ల ఆళ్లగడ్డ పట్టణ పోలీసులు అసభ్యంగా ప్రవర్తించారని మానవ హక్కుల సంఘానికి లిఖితపూర్వకంగా బాలిక ఫిర్యాదు చేసింది. సెల్‌ఫోన్‌లో అశ్లీల చిత్రాలను చూపించారని... తాము చెప్పినట్లు వినాలని బెదిరించారని ఆ ఫిర్యాదులో పేర్కొంది.


మాకు తెలియదు: పట్టణ ఎస్‌ఐ సత్యనారాయణ 


ఆత్మకూరు మండలం సిద్ధాపురం గ్రామానికి చెందిన  బాలిక మా సిబ్బందిపై మానవ హక్కుల సంఘానికి పిర్యాదు చేసిన విషయం  తెలియదు.

Updated Date - 2022-05-22T06:11:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising