CM Jagan: మూడున్నరేళ్లలో రైతులకు రూ. లక్ష 33 వేల కోట్లు ఖర్చు చేసాం..
ABN, First Publish Date - 2022-10-17T21:09:09+05:30
మూడున్నరేళ్లలో రైతులకు రూ. లక్ష 33 వేల కోట్లు ఖర్చు చేశామని సీఎం జగన్ తెలిపారు.
నంద్యాల (Nandyala): మూడున్నరేళ్లలో రైతులకు రూ. లక్ష 33 వేల కోట్లు ఖర్చు చేశామని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి (CM Jagan) తెలిపారు. సోమవారం సీఎం ఆళ్లగడ్డ (Allagadda) పర్యటనకు వచ్చారు. ఈ సందర్భంగా పట్టణంలోని వైపీపీ కళాశాల మైదానంలో రెండో విడత రైతు భరోసా, మూడో విడత పీఎం కిసాన్ పథకం కింద నిధులను బటన్ నొక్కి విడుదల చేశారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సమావేశంలో మాట్లాడుతూ మూడున్నరేళ్లుగా ఒక్క మండలాన్ని కూడా కరువు మండలంగా ప్రకటించే పరిస్థితి లేదన్నారు. 21 జిల్లాల్లో సాధారణ వర్షపాతం, 5 జిల్లాల్లో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయిందన్నారు. ఆహార ధాన్యాల ఉత్పత్తి బాబు హయాంలో 154 లక్షల టన్నులు కాగా ప్రస్తుతం 164 లక్షల టన్నుల ఉత్పత్తి అవుతోందన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక సున్నా వడ్డీ పునరుద్ధరించి రూ. 1280 కోట్లు ఇచ్చామని సీఎం జగన్ చెప్పారు. కాగా ముఖ్యమంత్రి జగన్ ఆళ్లగడ్డ పర్యటన నేపథ్యంలో మండలంలోని ప్రైవేటు పాఠశాలలకు అధికారికంగా సెలవు ప్రకటించారు.
Updated Date - 2022-10-17T21:09:09+05:30 IST