ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏఎస్‌ఐనని మోసం

ABN, First Publish Date - 2022-03-06T05:08:46+05:30

జూపాడుబంగ్లా మండలంలోని 80బన్నూరు గ్రామానికి చెందిన రాజ్‌కుమార్‌, పారుమంచాల గ్రామానికి చెందిన శ్రీనివాసులు అనే యువకులు మోసానికి గురయ్యారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  జూపాడుబంగ్లా మండలంలో రూ. 50వేలు వసూలు 

జూపాడుబంగ్లా, మార్చి 5: జూపాడుబంగ్లా మండలంలోని 80బన్నూరు గ్రామానికి చెందిన రాజ్‌కుమార్‌, పారుమంచాల గ్రామానికి చెందిన శ్రీనివాసులు అనే యువకులు మోసానికి గురయ్యారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గుర్తుతెలియని ఓ వ్యక్తి జూపాడుబంగ్లా పోలీసుస్టేషనులో ఏఎ్‌సఐ హరిప్రసాద్‌నంటూ ఇరువురు యువకులకు ఫోను చేసి తన కుటుంబసభ్యులకు ఆరోగ్యం బాగాలేదని, త్వరగా ఫోనపే ద్వారా డబ్బులు పంపాలని డిమాండ్‌ చేశారని, లేకపోతే తమ పోలీసులు ఊర్లోకి వస్తారని వెంటనే వారికి ఇచ్చి పంపండని చెప్పడంతో వారు ఫోనపే ద్వారా రాజ్‌కుమార్‌ రూ.30వేలు, శ్రీనివాసులు రూ.20వేలు డబ్బులు పంపారు. తర్వాత హరిప్రసాద్‌ అనే ఏఎ్‌సఐ జూపాడుబంగ్లా పోలీసుస్టేషనలో లేడని తెలుసుకుని తాము మోసపోయినట్లు గ్రహించారు. వెంటనే జూపాడుబంగ్లా పోలీసుస్టేషనను ఆశ్ర యించారు. ఈ విషయమై ఎస్‌ఐ వెంకటసుబ్బయ్యను వివరణ కోరగా బాధితులు 12రోజుల కిందట వచ్చిన మాట వాస్తవమేనన్నారు. సైబర్‌నేరం కిందకు వస్తుందని కర్నూలులో కలవమని చెప్పామని  తెలిపారు.


Updated Date - 2022-03-06T05:08:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising