ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

డ్రైనేజీలు నిర్మించండి

ABN, First Publish Date - 2022-05-24T06:28:31+05:30

సంక్షేమ పథకాలు సరే... మా కాలనీలలో డ్రైనేజీలు నిర్మించ లేదని, దీంతో మురుగునీటి సమస్యతో ఇబ్బంది పడుతున్నామని మహిళలు సోమవారం ఆదోని పట్టణంలోని కోయనగర్‌లో నిర్వహించిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాంకు సమస్యలు ఏకరువు పెట్టారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మంత్రికి సమస్యలు విన్నవించిన మహిళలు

ఆలూరు, మే 23: సంక్షేమ పథకాలు సరే... మా కాలనీలలో డ్రైనేజీలు నిర్మించ లేదని, దీంతో మురుగునీటి సమస్యతో ఇబ్బంది పడుతున్నామని మహిళలు సోమవారం ఆదోని పట్టణంలోని కోయనగర్‌లో నిర్వహించిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాంకు సమస్యలు ఏకరువు పెట్టారు. ఈ సందర్భంగా కాలనీలలో మంత్రి జయరాం పర్యటించారు. సంక్షేమ పథకాలు సక్రమంగా అందుతున్నాయా లేదా అని గడపగడపకు వెళ్ళి తెలుసుకున్నారు.  వైసీపీ ప్రభుత్వం పార్టీలకతీతంగా సంక్షేమ పథకాలను అందిస్తూ ఒక్కో కుటుంబానికి నవరత్నాల ద్వారా రూ.లక్షలు లబ్ధ్ది చేకూరుస్తున్నారన్నారు.  అనంతరం కోయనగర్‌లో ఎంపీపీ  నిధులతో నిర్మించిన బోరు నీటి ట్యాం కులను ఆయన ప్రారంభించారు. కార్యక్రమంలో మంత్రి సోదరులు శ్రీనివాసులు, నారాయణస్వామి, మార్కెట్‌యార్డు వైస్‌ చైౖర్మన్‌ చిన్న ఈరన్న,  జడ్పీటీసీ ఏరూరు శేఖర్‌, ఎంపీపీ  సుభాషిణి, వైస్‌ ఎంపీపీ నాగవేణి, వైస్‌ సర్పంచు రవి, వార్డుమెంబర్‌ శేఖర్‌, ఎంపీడీవో అల్లాబకాష్‌ పాల్గొన్నారు.


Updated Date - 2022-05-24T06:28:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising