ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అప్రమత్తంగా ఉండాలి

ABN, First Publish Date - 2022-10-08T05:16:23+05:30

వెలుగోడు బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ నుంచి స్పిల్‌వేకు నీరు విడుదల చేస్తున్న కారణంగా కుందూ లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని రెవెన్యూ, మున్సిపల్‌ అధికారులను కలెక్టర్‌ డాక్టర్‌ మనజీర్‌ జిలానీ సామూన్‌ ఆదేశించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలి
వాగుల్లో ప్రవాహ ఉధృతిని పరిశీలించిన కలెక్టర్‌           

నంద్యాల టౌన్‌, అక్టోబరు 7: వెలుగోడు బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ నుంచి స్పిల్‌వేకు నీరు విడుదల చేస్తున్న కారణంగా కుందూ లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని రెవెన్యూ, మున్సిపల్‌ అధికారులను కలెక్టర్‌ డాక్టర్‌ మనజీర్‌ జిలానీ సామూన్‌ ఆదేశించారు. శుక్రవారం పట్టణంలోని రాణి మహారాణి థియేటర్‌ సమీపంలో కుందూనదిని, దళితవాడ - భీమవరం మధ్యన మద్దిలేరు వాగు ఉధృతిని  కలెక్టర్‌ పరిశీలించారు. ఇంకా వర్షాలు కురిసి కుందూ నదికి వరద సంభవిస్తే విపత్తును ఎదుర్కొనేందుకు అధికారులు సిద్ధంగా  ఉండాలని ఆదేశించారు.  మున్సిపల్‌, తహసీల్దార్‌, ఆర్డీవో కార్యాలయాల్లో కమాండ్‌ కంట్రోల్‌ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని  ఆదేశించారు. వెలుగోడు రిజర్వాయర్‌ నుండి స్పిల్‌వేకు నీటి ప్రవాహం నిలిచిపోయిందని, వరద మరింత తగ్గుముఖం పడుతుందని కేసీ కెనాల్‌ ఈఈ తిరుమలేశ్వరరెడ్డి కలెక్టర్‌కు తెలిపారు. కలెక్టర్‌ వెంట మున్సిపల్‌ కమిషనర్‌ రవిచంద్రారెడ్డి, తహసీల్దార్‌ శ్రీనివాసులు  ఉన్నారు.

బండి ఆత్మకూరు: కుందూనదితో పాటు, వాగులు, వంకలకు ఉధృతంగా ప్రవహిస్తున్న దృష్ట్యా ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్‌ డాక్టర్‌ మనజీర్‌ జిలానీ సామూన్‌ సూచించారు. శుక్రవారం మండలంలోని కుందూనది, మద్దిలేరు, పోతులవాగుల్లో నీటి ప్రవాహ ఉధృతిని ఆయన వివిధ శాఖల అధికారులతో కలసి పరిశీలించారు. కుందూలో ఇప్పటికే 16 టీఎంసీలకు పైగా నిల్వ ఉందన్నారు. గాలేరు నది ద్వారా కుందూకు నీటి విడుదల పెరిగే అవకాశం ఉన్నందున నదీ తీర గ్రామాల ప్రజలు, రెవెన్యూ, నీటి పారుదల, పంచాయతీరాజ్‌ అధికారులను అప్రమత్తం చేశామన్నారు. కలెక్టర్‌ వెంట నంద్యాల సబ్‌ కలెక్టర్‌ శ్రీనివాసులు, కేసీ ఈఈ తిరుమలేశ్వరరెడ్డి, తహాశీల్దార్‌ హారిత, ఎంపీడీవో వాసుదేవగుప్త, ఏఈ వెంకటేశ్వర్లు, ఆర్‌ఐ సుప్రియ. వీఆర్వోలు ఉన్నారు.

Updated Date - 2022-10-08T05:16:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising