ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆకాశంలో అరటి

ABN, First Publish Date - 2022-06-29T04:57:58+05:30

అరటి అందరికీ అందుబాటులో ఉండే ఫలం. మార్కెట్‌లో విరివిగా దొరికేది అరటి పండ్లే. కానీ ఇప్పుడు అవి కనబడటం లేదు. దీంతో వాటికి డిమాండ్‌ బాగా పెరిగిపోయింది.

అరటి తోట
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

డజన్‌ రూ.100కు పైమాటే 

వరదలతో తగ్గిన దిగుబడి 


ఆత్మకూరు, జూన్‌ 28: అరటి అందరికీ అందుబాటులో ఉండే ఫలం. మార్కెట్‌లో విరివిగా దొరికేది అరటి పండ్లే. కానీ ఇప్పుడు అవి కనబడటం లేదు. దీంతో వాటికి డిమాండ్‌ బాగా పెరిగిపోయింది. డజను వంద రూపాయలకు పైనే పలుకుతోంది. జిల్లాలో అరటి దిగుబడి బాగా తగ్గడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. ఇంత పెట్టి ఏం కొంటాలే అని పరిస్థితి వచ్చింది. అరటి విక్రయం మీద జీవించేవాళ్లు వ్యాపారం      చేయడం తగ్గించారు. 


ఎన్నడూ లేనివిధంగా డజన్‌ అరటి పండ్లు ఏకంగా వంద రూపాయలు దాటేశాయి. దీంతో అరటిపండ్లను కొనాలంటే జనం భయపడుతున్నారు. కొనేవాళ్లు లేక వ్యాపారులకు దిక్కుతోచడం లేదు. నంద్యాల జిల్లాలో పచ్చిఅరటి, అమృతపాణి, సుగంధాల రకాలకు చెందిన అరటిపండ్లకు మంచి గిరాకీ ఉండేది. ప్రత్యేకించి పచ్చి అరటి గెలలను టన్నుల కొద్ది కొని ఏసీ గోదాముల్లో ఇథిలిన్‌ గ్యా్‌స ద్వారా పక్వం చేపట్టి పండ్లను విక్రయించే వారు. ఒకప్పుడు హోల్‌సేల్‌ కింద టన్ను అరటి రూ.3వేల నుంచి రూ.4వేలకు లభించేవి. అయితే ప్రస్తుతం టన్ను రూ.16వేల నుంచి రూ.18వేలకుపైగా హోల్‌సేల్‌లో కొంటున్నారు. ఈ లెక్కన గత ఏడాది ఇదే సమయంలో డజన్‌ రూ.50కి మించి పలకని నాణ్యమైన అరటిపండ్ల ధర ఈ ఏడాది రూ.100 దాటిపోయింది. ఒక్క ఆత్మకూరు పట్టణంలోనే ప్రతిరోజు 10టన్నుల వరకు అరటి విక్రయాలు జరగాల్సి ఉండగా ధరల పెరుగుదల వల్ల మూడు, నాలుగు టన్నులకు మించి వ్యాపారం జరగడం లేదని అరటి వ్యాపారస్థులు ఆవేదన చెందుతున్నారు. 


తగ్గిన అరటి దిగుబడులు 


నంద్యాల జిల్లాలోని మహానంది, ఆళ్లగడ్డ, రుద్రవరం, చాగలమర్రి, శిరివెల్ల, డోన్‌, ప్యాపిలి, బండిఆత్మకూరు తదితర మండలాల్లో ప్రస్తుతం సుమారు 4300 ఎకరాల్లో అరటి పంట సాగులో వుంది. గతంలో నంద్యాల జిల్లాలోని వివిధ ప్రాంతాల్లోని మార్కెట్లకు కడప, కర్నూలు, అనంతపురం ఉమ్మడి జిల్లాల నుంచి అరటి దిగుమతి అయ్యేవి. అయితే గత ఏడాది అనంతపురం, కడప జిల్లాలో వరదలు రావడంతో అరటితోటలు చాలా వరకు దెబ్బతిన్నాయి. పైగా కొన్నేళ్లుగా అరటిసాగుకు ప్రభుత్వం రాయితీ ఇవ్వడం లేదు. దీంతో నష్టాలను భరించలేక రైతులు అరటి పంటలను మధ్యనే తొలగించారు. ఇటీవల అరటిపంటను ఆకుపచ్చ తెగులు ఆశించింది. ఇది పంట దిగుబడులపై తీవ్ర ప్రభావం చూపింది. వెరసి అరటి దిగుబడి తగ్గిపోయింది. ఫలితంగా ధరలు ఆకాశాన్ని చేరాయి. ఇదే పరిస్థితి మరో రెండు నెలల పాటు ఉండే అవకాశం వుందని వ్యాపారులు పేర్కొంటున్నారు. ఇదిలావుంటే రాయలసీమ జిల్లాల్లో సాగైన అరటి దిగుబడులకు దేశంలోని వివిధ ప్రాంతాల్లో మంచి గిరాకీ ఉంది. దీంతో ఇక్కడ పండిన అరటిని ఇతర రాష్ట్రాలకు దిగుమతి చేస్తున్నారు. దీని వల్ల కూడా స్థానికంగా అరటి పండ్ల ధరలు పెరిగిపోయాయి. 


వ్యాపారాలు క్షీణించాయి


గతంలో ఎన్నడూ లేనివిధంగా అరటిపండ్ల ధరలు పెరగడంతో వ్యాపారాలు క్షీణించాయి. దీనికితోడు అరటి ఉత్పత్తులు కూడా నాసిరకంగా ఉన్నాయి. దీంతో కొనడానికి జనం ఆసక్తి చూపడం లేదు. అరటిసాగును ప్రోత్సహించి దిగుబడులు పెంచే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకున్నప్పుడే అరటి రైతులకు, వ్యాపారులకు, కొనుగోలుదారులకు ప్రయోజనం చేకూరుతోంది. 


 సయ్యద్‌ గౌస్‌ఆజం, అరటిపండ్ల వ్యాపారి, ఆత్మకూరు


సగానికి వ్యాపారాలు పడిపోయాయి


ఆత్మకూరులోని మా అరటి పండ్ల గోదాము నుంచి ప్రతి రోజు 150 బాక్స్‌లకు పైగా హోల్‌సేల్‌ విక్రయాలు జరిగేవి. ధరలు పెరగడంతో పాటు నాసిరకమైన దిగుబడులు రావడం వల్ల వ్యాపారం పడిపోయింది. కేవలం 70 నుంచి 80బాక్స్‌లు మాత్రమే అమ్ముడుపోతున్నాయి.   


 - షఫివుల్లా, అరటిపండ్ల నిల్వ కేంద్రం నిర్వాహకుడు, ఆత్మకూరు 

Updated Date - 2022-06-29T04:57:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising