ప్రముఖులకు అవార్డుల ప్రదానం
ABN, First Publish Date - 2022-03-05T05:38:17+05:30
రాఘవేంద్ర స్వామి గురుభక్తి ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం రాత్రి యోగీంద్ర కళామండపంలో 2022 గురువైభోత్సవ అవార్డులను ప్రదానం చేశారు.
మంత్రాలయం, మార్చి 4: రాఘవేంద్ర స్వామి గురుభక్తి ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం రాత్రి యోగీంద్ర కళామండపంలో 2022 గురువైభోత్సవ అవార్డులను ప్రదానం చేశారు. ఏపీ హైకోర్టు జడ్జిలు జస్టిస్ డీవిఎస్‌ఎస్ సోమయాజులు, జస్టిస్ రఘునందనరావు, రిటైర్డ్ ఏపీ హైకోర్టు జడ్జి జస్టిస్ వెంకటరమణ, గౌహతి రిటైర్డ్ చీఫ్ జడ్జి జస్టిస్ శ్రీధర్‌రావు, ధర్మస్థల ధర్మాఽధికారి వీరేంద్రహెగ్డే, చైన్నైకి చెందిన ప్రముఖ వైద్యుడు కృష్ణారావు, బెంగళూరుకు చెందిన విద్వాన్ వీరసత్యనారాయణ ఆచార్ పాండురంగ, తెలుగు, కన్నడ ప్రముఖ హీరో సుదీప్‌లకు అవార్డులను ప్రదానం చేశారు. అవార్డులతోపాటు ప్రశంసాపత్రం మెమెంటో నగదు, వెండి తట్ట ఫల, పుష్ప, పరిమళప్రసాదంతో సన్మానించారు. అవార్డులు అందుకున్న న్యాయమూర్తులు తమ పూర్వజన్మ సుకృతమని భావిసున్నామని అన్నారు. దార్వాడకు చెందిన గీతాచే దాసవాణి సాహిత్యం, బెంగళూరుకు చెందిన ఉపాధ్యాయ బృందం ఆధ్వర్యంలో ప్రదర్శించిన భరతనాట్యం భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో విద్వాన్ రాజాఎస్‌గిరిరాజాచార్, ఏఏవో మాధవశెట్టి, శ్రీమఠం ఓఎస్డీ ఎస్‌కే శ్రీనివాసరావు, ఎమ్మిగనూరు కోర్టు జడ్జి గురుఅరవింద్, అసిస్టెంట్ మేనేజర్ ఐపీ నరసింహమూర్తి, మంత్రాలయం, మాధవరం ఎస్‌ఐలు వేణుగోపాల్‌రాజు, ఉసేన్‌పీరా పాల్గొన్నారు.
Updated Date - 2022-03-05T05:38:17+05:30 IST