ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆరోగ్యశ్రీ సేవలందించాలి

ABN, First Publish Date - 2022-08-31T06:10:12+05:30

నెట్‌ వర్క్‌ ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ కింద రోగులకు ఉచితంగా వైద్య సేవలందించాలని కలెక్టర్‌ కోటేశ్వరావు వైద్యాధికారులు, ప్రైవేట్‌ ఆస్పత్రుల యజమానులను ఆదేశించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కలెక్టర్‌ కోటేశ్వరరావు


కర్నూలు (కలెక్టరేట్‌) ఆగస్టు 30:  నెట్‌ వర్క్‌ ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ కింద రోగులకు ఉచితంగా వైద్య సేవలందించాలని కలెక్టర్‌ కోటేశ్వరావు వైద్యాధికారులు, ప్రైవేట్‌ ఆస్పత్రుల యజమానులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స హాల్లో ఆరోగ్యశ్రీ అమలుపై వైద్యాధికారులు, ప్రైవేట్‌ ఆసుపత్రుల యాజమాన్యాలతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఆరోగ్యశ్రీ ద్వారా పేదలకు కార్పొరేట్‌ వైద్యం అందించేందుకు ప్రభుత్వం వేల కోట్ల రూపాయలను ఖర్చు చేస్తోందన్నారు. అయినప్పటికీ ఈ అంశంపై అక్కడక్కడ విమర్శలు వస్తున్నాయన్నారు. విమర్శలకు తావివ్వకుండా ప్రభుత్వం ఆశించిన విధంగా రోగులకు ఉచితంగా వైద్య సేవలందించేందుకు ప్రైవేట్‌ ఆస్పత్రుల యాజమాన్యాలు చర్యలు తీసుకోవాలన్నారు.  ఈ ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ అమలును పరిశీలించేందుకు  కలెక్టర్‌ అధ్యక్షతన డిసిప్లీనరీ కమిటీ ఏర్పాటు అయ్యిందన్నారు.  సమావేశంలో డీఎంహెచవో రామగిడ్డయ్య, ఆరోగ్యశ్రీ జిల్లా కోఆర్డినేటర్‌ రఘు, డీసీహెచసీ రాంజీ నాయక్‌, ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రి డా. నరేద్రనాథ్‌రెడ్డి, డిప్యూటీ సూపరింటెండెంట్‌ డా. ప్రభాకర్‌రెడ్డి, ప్రైవేట్‌ ఆసుపత్రుల యజమానులు పాల్గొన్నారు. 


Updated Date - 2022-08-31T06:10:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising