ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సీపీఎస్‌ను రద్దు చేయాలి: ఏపీటీఎఫ్‌

ABN, First Publish Date - 2022-08-12T06:00:14+05:30

ఎన్నికల ముందు జగన్‌ ఇచ్చిన హామీ మేరకు సీపీఎస్‌ను రద్దుచేసి, పాత పెన్షన్‌ విధానాన్ని పునరుద్ధరించాలని ఏపీటీఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు రామచంద్రారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి కేవీ శివయ్య డిమాండ్‌ చేశారు.

కలెక్టరేట్‌ ఎదుట ధర్నా చేస్తున్న ఏపీటీఎఫ్‌ నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నంద్యాల (నూనెపల్లె), ఆగస్టు 11: ఎన్నికల ముందు జగన్‌ ఇచ్చిన హామీ మేరకు సీపీఎస్‌ను రద్దుచేసి, పాత పెన్షన్‌ విధానాన్ని పునరుద్ధరించాలని ఏపీటీఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు రామచంద్రారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి కేవీ శివయ్య డిమాండ్‌ చేశారు. ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యల పరిష్కారానికి గురువారం ఏపీటీఎఫ్‌ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ ముట్టడి కార్యక్రమాన్ని చేపట్టారు. కలెక్టరేట్‌ ఎదుట నిరసన వ్యక్తం చేసి వారు మాట్లాడారు. జీవో 117ను రద్దుచేసి, 3, 4, 5వ తరగతులను ఉన్నత పాఠశాలల్లో విలీనం చేసే ప్రక్రియను నిలిపివేయాలని డిమాండ్‌ చేశారు. అన్ని ప్రభుత్వ యాజమాన్య పాఠశాలల్లో తెలుగు, ఆంగ్ల మాధ్యమాన్ని రెండింటిని కొనసాగించాలని, ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్‌ చేశారు. కరోనాతో మృతిచెందిన ఉపాధ్యాయుల కుటుంబ సభ్యులకు కారుణ్య నియమాకాలు చేపట్టాలని కోరారు. ప్రావిడెండ్‌ ఫండ్‌, ఏపీజీఎల్‌ఐ, డీఏ బకాయిలు, సంపాధిత సెలవులు, మెడికల్‌ రీయింబర్స్‌మెంట్‌ బిల్లులు, అరియర్స్‌ వెంటనే చెల్లించాలని, మున్సిపల్‌ ఉపాధ్యాయులకు పీఎఫ్‌ సౌకర్యం కల్పించాలని, ప్రధానోపాధ్యాయులకు డీడీవో అధికారాలు ఇచ్చి ఉపాధ్యాయ బదిలీలు చేపట్టాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో ఏపీటీఎఫ్‌ రాష్ట్ర కౌన్సిలర్‌ భాస్కర్‌రెడ్డి, వీరేశ్వరరెడ్డి, మహమ్మద్‌ హానీఫ్‌, జిల్లాలోని వివిధ మండలాల అధ్యక్ష, కార్యదర్శులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-08-12T06:00:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising