ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘రాష్ట్రంలో అరాచక పాలన’

ABN, First Publish Date - 2022-06-25T05:57:49+05:30

రాష్ట్రంలో వైసీపీ అరాచ‌క పాల‌న సాగిస్తోంద‌ని పాణ్యం మాజీ ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి మండిపడ్డారు.

మాట్లాడుతున్న‌ గౌరు చ‌రితారెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నంద్యాల (నూనెపల్లె), జూన్‌ 24: రాష్ట్రంలో వైసీపీ అరాచ‌క పాల‌న సాగిస్తోంద‌ని పాణ్యం మాజీ ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి మండిపడ్డారు. గడివేముల మండలం ఎల్‌కే తండాలో గిరిజన మహిళపై వైసీపీ నాయకుల దౌర్జన్యం,అరాచకంతో అక్రమ కేసులు బనాయించడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్యాయత్నానికి పాల్పడడం బాధాకరమన్నారు. జరిగిన ఘటనపై ఎస్పీ రఘువీర్‌రెడ్డిని ఆమె కలిసి ఫిర్యాదు చేశారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ వైసీపీ నాయకుల అరాచక పాలనకు ప్రజలు చరమగీతం పాడే సమయం ఆసన్నమైందన్నారు. బాధితురాలు గత 30 ఏళ్ల నుంచి గ్రామంలో రేషన్‌ డీలర్‌గా పనిచేస్తున్నారని, అయితే రేషన్‌ డీలర్‌షిప్‌ను వైసీపీ నాయకులకు కైవసం చేసుకునేందుకు ఆమెపై అక్రమ కేసులు బనాయించడంఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. బాధితురాలికి న్యాయం చేయాలని, జరిగిన ఘటనపై సమగ్ర విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని ఎస్పీని కోరినట్లు ఆమె తెలిపారు.

Updated Date - 2022-06-25T05:57:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising