అంబేడ్కర్ ఆశయ సాధనకు కృషి చేయాలి
ABN, First Publish Date - 2022-04-15T05:03:08+05:30
అట్టడుగు వర్గాల అభివృద్ధికి అహర్నిశలు శ్రమించిన డా.బీఆర్ అంబేడ్కర్ జీవితం అందరికీ ఆదర్శమని కలెక్టర్ పి.కోటేశ్వరరావు అన్నారు.
కలెక్టర్ పి.కోటేశ్వరరావు
కర్నూలు(ఎడ్యుకేషన), ఏప్రిల్ 14: అట్టడుగు వర్గాల అభివృద్ధికి అహర్నిశలు శ్రమించిన డా.బీఆర్ అంబేడ్కర్ జీవితం అందరికీ ఆదర్శమని కలెక్టర్ పి.కోటేశ్వరరావు అన్నారు. డా.బీఆర్ అంబేడ్కర్ 131వ జయంతి మహోత్సవాలను పురస్కరించుకుని స్థానిక జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గురువారం స్థానిక పాతబస్టాండులోని డా.బీఆర్ అంబేడ్కర్ విగ్రహానికి కలెక్టర్ కోటేశ్వరరావు, ఎస్పీ సుధీర్ కుమార్ రెడ్డి, ఎంపీ సంజీవకుమార్, ఎమ్మెల్యేలు కాటసాని రాంభూపాల్‌రెడ్డి, హఫీజ్‌ఖానలు, నగర మేయర్ బీవై రామయ్యలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కలెక్టర్ మాట్లాడుతూ భారతదేశ రాజ్యాంగ నిర్మాణం కోసం విశేష కృషి చేసిన అంబేడ్కర్ ఆశయాలను ప్రతి ఒక్కరూ నెరవేర్చేదిశగా పయనించాలని కలెక్టర్ సూచించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన రెడ్డి, ఆర్డీవో హరిప్రసాద్, సోషల్ వెల్ఫేర్ డీడీ ప్రసాద్ సూర్యనారాయణ రెడ్డి, ఎస్సీ కార్పొరేషన ఏడీ శ్రీనివాసకుమార్, మాజీ ఎమ్మెల్సీ సుధాకర్‌బాబు, బీసీ సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి నక్కలమిట్ట శ్రీనివాసులు, సాంఘిక సంక్షేమ శాఖ సూపరింటెండెంట్లు ప్రకాష్, శివారెడ్డి, మాజీ మేయర్ బంగీ అనంతయ్య, డీవీఎంసీ మెంబర్స్ సాయిప్రదీప్, పత్తి రాజశేఖర్, ఊట్ల రమేష్‌బాబు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంఘాల నాయకులు కొమ్ముపాలెం శ్రీనివాసులు, బాలసుందరం, సోమసుందరం, అనంతరత్నం మాదిగ, పీహెచ మద్దయ్య పాల్గొన్నారు.
Updated Date - 2022-04-15T05:03:08+05:30 IST