ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైసీపీ పాలనలో అన్ని రంగాలు నిర్వీర్యం

ABN, First Publish Date - 2022-03-06T05:12:46+05:30

వైసీపీ పాలనలో అన్ని రంగాలు నిర్వీర్యమయ్యాయని ఏపీ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్రయాదవ్‌ అన్నారు.

మాట్లాడుతున్న బీద రవిచంద్రయాదవ్‌, మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దనరెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  ఏపీ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్రయాదవ్‌

బనగానపల్లె, మార్చి 5: వైసీపీ పాలనలో అన్ని రంగాలు నిర్వీర్యమయ్యాయని ఏపీ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్రయాదవ్‌ అన్నారు. శనివారం బనగానపల్లె టీడీపీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దనరెడ్డితో కలిసి విలేఖరుల సమావేశం నిర్వహించారు. బీద రవిచంద్ర మాట్లాడుతూ వైసీపీ అధికారంలోకి వచ్చి మూడేళ్లు పూర్తి చేసుకుందని, ఈ ప్రభుత్వం ప్రతి నిర్ణయం ప్రజల్లో గందరగోళానికి నెట్టాయన్నారు. టీడీపీపై బురద చల్లడమే పనిగా పెట్టుకుందని విమర్శించారు. ప్రతి తప్పుడు నిర్ణయానికి చంద్రబాబే కారణమని సీఎం జగన, వారి అనుచర బృందం నిత్యం తప్పుడు ఆరోపణలు చేస్తోందని ఆరోపించారు. అమరావతిని నాశనం చేసి మూడు రాజధానులు అంటూ వైసీపీ నాటకలాడుతోందన్నారు. హైకోర్టు అమరావతే రాజధాని అంటూ తీర్పు ఇచ్చినా సిగ్గు, ఎగ్గు లేకుండా వైసీపీ నాయకులు మూడు రాజధానులకు అసెంబ్లీలో బిల్లులు పెడతామని చెబుతున్నారని విమర్శించారు. శాసనమండలి రద్దు, సీఆర్‌డీఏ రద్దు, మూడు రాజధానులు రద్దు అంటూ తప్పుడు నిర్ణయాలు తీసుకుంటూ ఆ నిందలను తెలుగుదేశంపై వేస్తూ పబ్బం గడుపుకుంటున్నారన్నారు. గత ప్రభుత్వ ఒప్పందాలను అమలు చేయాలని కోర్టు చెబుతున్నా కోర్టు ఆదేశాలను వైసీపీ లెక్క చేయడం లేదన్నారు. నిత్యం టీడీపీపై దూషణలు చేయడం తప్ప వైసీపీ నాయకులకు పనే లేకుండాపోయిందన్నారు. కోడి కత్తి డ్రామా, పింక్‌ డైమండ్‌ డ్రామాలు ఆడారన్నారు. సొంత బాబాయి వివేకానందరెడ్డి హత్యను కూడా పక్కదారి పట్టిస్తున్నారన్నారు. వైసీపీ నాయకులే  వివేకానందరెడ్డిని హత్య చేసి టీడీపీపై నెట్టాలని చూస్తున్నారని విమర్శించారు. వివేకా హత్య కేసును మూడేళ్లుగా తేల్చకుండా హత్య చేసిన వారికి సీఎం మద్దతు ఇవ్వడం దుర్మార్గమైన చర్య అన్నారు.  రైతులు ఎరువుల కోసం రోడ్డున పడుతున్నారన్నారు. రైతులు పండించిన ధాన్యాన్ని కొనే పరిస్థితి లేదన్నారు. ధాన్యం కొన్నా రైతులకు డబ్బులు ఇవ్వకుండా రైతులను నట్టేటా ముంచుతోందన్నారు. రైతుభరోసా కే ంద్రాలు వైసీపీ నాయకులకు ఉపాధి కేంద్రాలుగా మారాయన్నారన్నారు.  ఉద్యోగులకు న్యాయం చేస్తామని చెప్పి, సీపీఎ్‌సను రద్దు చేస్తామని చెప్పివారు ఉద్యమిస్తే కేసులు పెట్టి భయబ్రాంతులకు గురి చేస్తున్నారన్నారు. విద్యావ్యవస్థను సర్వనాశనం చేశారన్నారు. ఒక్క పరిశ్రమ రాకుండా నిరుద్యోగులకు ఒక్క  ఉద్యోగం ఇవ్వకుండా నిరుద్యోగులకు తీవ్ర అన్యాయం చేశారన్నారు. టీడీపీ హయాంలో అభివృద్ధి, సంక్షేమం కోసం పనిచేశామన్నారు. మూడేళ్లైనా గతంలో పనిచేసిన పనులకు బిల్లులు చెల్లించాలని కోర్టు ఆదేశించినా,  టీడీపీ నాయకులను ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు.  బీసీ జనార్దనరెడ్డి బనగానపల్లె నియోజకవర్గం అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేశారని, సొంతఖర్చులు పెట్టి పలు అభివృద్ధి పనులు చేశారని ప్రశంసించారు.  కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దనరెడ్డి, రాష్ట్ర హెచఆర్‌డీ సభ్యులు రామగోపాల్‌రెడ్డి , జాహీద్‌హుస్సేన, దొనపాటి భాస్కర్‌రెడ్డి, తులసిరెడ్డి, జహంగీరు, కైప రాఘునాథరెడ్డి, నాగేంద్ర పాల్గొన్నారు. 


Updated Date - 2022-03-06T05:12:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising