ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైతుల ఆత్మహత్యలన్నీ ప్రభుత్వ హత్యలే

ABN, First Publish Date - 2022-05-21T05:48:04+05:30

రైతుల ఆత్మహత్యలన్నీ ప్రభుత్వ హత్యలేనని మంత్రాలయం నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి పాలకుర్తి తిక్కారెడ్డి అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మంత్రాలయం టీడీపీ ఇన్‌చార్జి తిక్కారెడ్డి


కోసిగి, మే 20:  రైతుల ఆత్మహత్యలన్నీ ప్రభుత్వ హత్యలేనని మంత్రాలయం నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి పాలకుర్తి తిక్కారెడ్డి అన్నారు. మండల పరిధిలోని డీ బెళగల్‌ గ్రామంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతి పక్షంలో ఉన్నప్పుడు ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు రూ.కోటి డిమాండ్‌ చేసిన వైఎస్‌ జగన్‌ నేడు అధికారంలో ఉండి ఎందుకు ఆదుకోవడం లేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో చంద్రబాబు, నారా లోకేష్‌ పర్యటనలకు ప్రజలు జాతరగా వస్తున్నారని, జనాల్లోకి వెళ్తున్న వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులకు మాత్రం జనాలు చీపుర్లతో స్వాగతం పలుకుతున్నారని అన్నారు. సగటు మనిషి జీవించాలంటేనే భయపడిపోతున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. పక్కనే ఉన్న కర్ణాటకలో లీటరు పెట్రోల్‌, డీజిల్‌ రూ.10కి తక్కువగా లభిస్తోందని అన్నారు. ఎన్నికలు ఎప్పుడు పెట్టినా తెలుగుదేశం పార్టీదే అధికారం అని జోస్యం చెప్పారు. అనంతరం మండల పరిధిలోని దొడ్డి గ్రామంలో టీడీపీ నాయకులు దేవనగిరి చిన్న తాయన్న కుమారుడు తిరుమలేష్‌, డీ.బెళగల్‌ గ్రామంలో యేసు రాజు వివాహాలకు తిక్కారెడ్డి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు మండల కన్వీనర్‌ జ్ఞానేష్‌, నాడిగేని అయ్యన్న, సాతనూరు కోసిగయ్య, కొండగేని వీరారెడ్డి, నాడిగేని రంగన్న, దుగ్డిరెడ్డి, నాడిగేని నర్సన్న, అమర్‌నాథ్‌ రెడ్డి  పాల్గొన్నారు.


Updated Date - 2022-05-21T05:48:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising