ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఈక్రాఫ్‌ నమోదులో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు

ABN, First Publish Date - 2022-08-11T04:52:34+05:30

ఈ క్రాఫ్‌ పంట నమోదులో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని ఆదోని ఆర్డీవో రామకృష్ణారెడ్డి హెచ్చరించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆర్డీవో రామకృష్ణారెడ్డి 

మంత్రాలయం, ఆగస్టు 10: ఈ క్రాఫ్‌ పంట నమోదులో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని ఆదోని ఆర్డీవో రామకృష్ణారెడ్డి హెచ్చరించారు. బుధవారం సాయంత్రం దుర్గారమణ కళ్యాణ మండపంలో మంత్రాలయం, కోసిగి, కౌతాళం, పెద్దకడుబూరు మండలాల తహసీల్దార్లు, ఆర్‌ఐలు, డీటీలు సర్వేయర్లు, వీఆర్వోలకు ఈక్రాఫ్‌ పంట నమోదుపై పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈక్రాఫ్‌ బుకింగ్‌ జాయింట్‌ అజమాయిషీ ఆనలైనను నమోదు చేయాలని సూచించారు. పంట పేరు, అనుభవదారుడు, ప్రభుత్వ భూములు, బీడు భూములు ఏ పంట నమోదు చేశారో వెబ్‌ల్యాండ్‌ ద్వారా నమోదు చేయాలని సూచించారు. నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈక్రాఫ్‌ పంట వల్ల ప్రకృతి వైపరీత్యాలు జరిగితే రైతులకు నష్టపరిహారం అందించేందుకు వీలు కలుగుతుందన్నారు. సమావేశంలో మంత్రాలయం, కౌతాళం, పెద్దకడుబూరు తహసీల్దార్లు రాఘవేంద్ర, చంద్రశేఖరవర్మ, సురేంద్ర గౌడు, డీటీ శశిశేఖర్‌రావు, మండల సర్వేయర్‌ వాహీద్‌, ఏఎ్‌సవోలు హేమంత కుమార్‌, సూర్యకుమార్‌, వెంకటేష్‌, ఆర్‌ఐలు ఆదామ్‌, శ్రీరాములు, వీఆర్వోలు ఆనంద్‌, కాశీం, భీముడు, భీమన్నగౌడు, రాజు, నరసప్ప, నతానియేలు, శ్వేత, సాయినవ్య, మౌనిక, స్రవంతి, ఉమ, ఉరుకుందాచారి, హరికృష్ణ, బసవరాజు, రాధారాణి, శిరీష, భవిత పాల్గొన్నారు.

Updated Date - 2022-08-11T04:52:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising