ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పథకం ప్రకారమే..

ABN, First Publish Date - 2022-12-15T23:41:54+05:30

ఓర్వకల్లు మండలం నన్నూరు గ్రామంలో తోడి కోడళ్లు రేణుక, రామేశ్వరి హత్య కేసులో పోలీసులకు కొంత స్పష్టత వచ్చింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నిందితులు భర్తలు, మామ

పోలీసుల విచారణలో నేరం ఒప్పుకోలు

కర్నూలు/ఓర్వకల్లు, డిసెంబరు 15: ఓర్వకల్లు మండలం నన్నూరు గ్రామంలో తోడి కోడళ్లు రేణుక, రామేశ్వరి హత్య కేసులో పోలీసులకు కొంత స్పష్టత వచ్చింది. డీఎస్పీ వెంకట్రామయ్య ఆధ్వర్యంలో రూరల్‌ సీఐ శ్రీనివాసరెడ్డి, ఎస్‌ఐ మల్లికార్జున బుధవారం అర్ధ్దరాత్రి నుంచి కేసు దర్యాప్తు ప్రారంభించారు. గురువారం వీరిద్దరి మృతదేహాలకు ప్రభుత్వ వైద్యులు పోస్టుమార్టం నిర్వహించారు. ఇరువురి శరీరాలపై కట్టెలతో కొట్టినట్లుగా పోస్టుమార్టం ప్రాథమిక నివేదికలో వెల్లడైంది. పోస్టుమార్టం పూర్తయిన తర్వాత మృతదేహాలను పోలీసులు వారి బంధువులకు అప్పగించారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఆసుపత్రిలో మార్చురి వద్ద ఉదయం నుంచే ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రేణుక, రామేశ్వరి భర్తలు పెద్ద రామగోవిందు, చిన్న రామగోవిందు, మామ బోగన్నలను బుధవారం అర్ధరాత్రి పోలీసులు అదుపులోకి తీసుకుని రహస్యంగా విచారించారు. పోలీసుల విచారణలో పలు ఆసక్తికరమైన విషయాలు వెల్లడించినట్లు తెలుస్తుంది.

అసలేం జరిగిందంటే..

రేణుక, రామేశ్వరి హత్యలకు వారి భర్తలు పెద్ద రామగోవిందు, చిన్న రామగోవిందు, మామ బోగన్నలే ప్రధాన కారణమని పోలీసుల విచారణలో వెల్లడైంది. వీరిని రహస్య ప్రదేశానికి తీసుకెళ్లి జరిపిన విచారణలో ఈ ముగ్గురు తమ నేరాన్ని ఒప్పుకున్నట్లు తెలిసింది. ఈ హత్యలకు ప్రధాన కారణం మూఢ నమ్మకమేనని తేలింది. ఇద్దరు అన్నదమ్ములకు పెళ్లయి నాలుగైదేళ్లవుతున్నా పిల్లలు కలగలేదు. ఆస్తులు ఉండి కుటుంబం మొత్తానికి పిల్లలు లేకపోవడం వారిని పూర్తిగా కలిచి వేసింది. దీంతో పాటు కొద్ది కాలం కింద బోగన్నకు అస్వస్థత చేసింది. జోహరాపురం గ్రామంలో ఉన్న ఓ నాటు వైద్యునికి వెళ్లగా.. తెలిసిన వారే మరుగు మందు పెట్టించారని చెప్పాడు. బోగన్నకు, అతని కొడుకులు ఇద్దరికీ రామేశ్వరి, రేణుకలపై అనుమానం మొదలైంది. ఎలాగైనా తోడికోడళ్లను అడ్డు తొలగించుకోవాలని బోగన్న కొంత కాలంగా అనుకుంటూ వచ్చాడు. తండ్రి మాటకు కొడుకులు ఎదురు చెప్పలేదు. బుధవారం అన్నదమ్ముల్దిరూ తమ భార్యలను పొలానికి తీసుకెళ్లి వదిలి పెట్టి వచ్చారు. కొద్దిసేపటికి మామ బోగన్న కూడా అక్కడికి వెళ్లాడు. రామేశ్వరి, రేణుక ఇద్దరూ పొలం పనుల్లో నిమగ్నమై ఉండగా.. బోగన్న వాళ్లను కర్రతో ఇష్టమొచ్చినట్లుగా కొట్టినట్లుగా పోలీసుల విచారణలో అంగీకరించాడు. ఆ దెబ్బలకు తాళలేక కిందపడిపోగా.. రాళ్లతో వారి మొఖంపై మోదినట్లు తెలుస్తోంది. దీనికి కొడుకులు ఇద్దరు సహకరించినట్లు సమాచారం. అంతకుముందే కొడుకులు ఇద్దరూ నన్నూరు బస్టాండుకు వచ్చి గోబి ప్యాకెట్లు, వాటర్‌ ప్యాకెట్లు తీసుకుని పొలానికి చేరుకున్నారు. సాయంత్రం 6 గంటలు దాటిన తర్వాత తమ భార్యలు ఇంటికి రాలేదని నటిస్తూ.. తిరిగి పొలానికి వచ్చి అక్కడ ఎవరో తమ భార్యలను హత్య చేశారని గ్రామంలోకి వెళ్లి గ్రామస్థులను నమ్మించారు. ఆ తర్వాత మామ భోగన్న సాయంత్రం కర్నూలులో ఉన్న ఓ ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లి చికిత్స కోసం చేరాడు. రాత్రి బోగన్నను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించినట్లు తెలిసింది. ఈ హత్య వివరాలను పోలీసులు అధికారికంగా ఇంకా ధృవీకరించలేదు. మరో రెండు రోజుల్లో ఇద్దరు నిందితులను అరెస్టు చేసే అవకాశాలు ఉన్నాయి.

ఉద్రిక్తతల మధ్య అంత్యక్రియలు

మృతురాళ్లు రేణుక, రామేశ్వరిల తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు మృతదేహాలకు ఇంటి ముందు అంత్యక్రియలు చేయాలని గొడవకు దిగారు. స్పందించిన డీఎస్పీ వెంకట్రామయ్య వారికి సర్దిచెప్పారు. చివరికి సొంత పొలంలో అంత్యక్రియలు జరిపారు. మామ, భర్తల ఇంటి వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.

Updated Date - 2022-12-15T23:41:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising