ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

12గంటల పని విధానాన్ని రద్దు చేయాలి: ఏఐటీయూసీ

ABN, First Publish Date - 2022-07-02T06:46:36+05:30

కేంద్ర ప్రభుత్వం జూలై 1 నుంచి తలపెట్టిన 12గంటల పని విధానాన్ని వెంటనే రద్దు చేయాలని ఏఐటీయూసీ నాయకులు కలెక్టరేట్‌ ముందు ధర్నా నిర్వహించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కర్నూలు (కలెక్టరేట్‌) జూలై 1: కేంద్ర ప్రభుత్వం జూలై 1 నుంచి తలపెట్టిన 12గంటల పని విధానాన్ని వెంటనే రద్దు చేయాలని ఏఐటీయూసీ నాయకులు కలెక్టరేట్‌ ముందు ధర్నా నిర్వహించారు. ఈకార్యక్రమానికి ఏఐటీయూసీ రాష్ట్ర నాయకులు జె.లలితమ్మ, ఎన్‌.మనోహర్‌ మాణిక్యం, ఎస్‌.మునెప్ప హాజరై మాట్లాడారు. కార్మిక వర్గం బ్రిటీష్‌ కాలం నుంచి అనేక పోరాటాలు త్యాగాలు చేసి సాధించుకున్నటువంటి 44 చట్టాల్ని రద్దు చేయడం దుర్మార్గమన్నారు. అలాగే వాటి స్థానంలో నాలుగు లేబర్‌ కోడ్స్‌ను తీసుకురావడం వలన భారతదేశ కార్మిక వర్గం పని భద్రత సామాజిక భద్రత లాంటి అనేక హక్కులకు దూరమవుతుందని అన్నారు.  తక్షణమే 12 గంటల పని విధానాన్ని అమలు నిలిపివేసి 8 గంటల పని విధానం కొనసాగించాలని వారు డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ నగర అధ్యక్షుడు  బి.వెంకటేష్‌, నగర ఉప ప్రధాన కార్యదర్శి రామాంజనేయులు, బి.కుమార్‌ నల్లన, ఈశ్వర్‌, గణేష్‌, కిట్టు, రాము, శ్రీను పాల్గొన్నారు.

Updated Date - 2022-07-02T06:46:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising