ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పండగ లేని పల్లె

ABN, First Publish Date - 2022-01-15T05:03:42+05:30

సంక్రాంతి అంటేనే సంబరాల పండుగ. పల్లెలన్నీ శోభాయమానంగా వెలిగిపోయేవి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సంక్రాంతికీ రాని వలస కూలీలు
బోసిపోయిన గ్రామం
విచారంగా వృద్ధులు, పిల్లలు
చింతకుంట గ్రామం దీనగాథ


కోసిగి, జనవరి 14: సంక్రాంతి అంటేనే సంబరాల పండుగ. పల్లెలన్నీ శోభాయమానంగా వెలిగిపోయేవి. చాలా పల్లెలు ఇప్పుడు అట్లా లేవు. కరువు, వలసలతో, వ్యవసాయం గిట్టుబాటు కాకపోవడంతో ఊళ్లు శిథిలమయ్యాయి. కష్టం చేయగలవాళ్లందరూ పొట్ట చేతపట్టుకొని దేశం మీద పోతారు. పండుగకు కూడా తిరిగి రావడం కష్టం. ముసలివాళ్లు, పిల్లలు మాత్రమే ఇండ్లలో ఉంటారు. అలాంటి ఊళ్లకు పండుగ ఎలా వస్తుంది? కోసిగి మండలం చింతకుంట అలాంటి పల్లె.

ఈ ఊళ్లో 510 కుటుంబాలు ఉన్నాయి. 2,850 జనాభా, 1,820 ఓటర్లు ఉన్నారు. ఆ గ్రామానికి కూతవేటు దూరంలో పులికనుమ ప్రాజెక్టు ఉంది. కానీ ఈ ఏడాది అధిక వర్షాలు, వైరస్‌ వల్ల పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఊర్లో పనులు లేక పోవడంతో 200 రైతు కుటుంబాలు గుంటూరు, కర్ణాటక, తెలంగాణ తదితర ప్రాంతాలకు వలస వెళ్లాయి. గ్రామంలో ఏ వీధి చూసినా బోసిపోయి కనిపిస్తోంది. చాలా ఇండ్లకు తాళాలు ఉన్నాయి. కొన్ని ఇండ్లలో వృద్ధులు, పిల్లలు మాత్రమే ఉన్నారు. జిల్లాలోని పడమటి గ్రామాలకు చింతకుంట ఒక ఉదాహరణ మాత్రమే. ఈ ఊరి గురించి ఏ అధికారికీ పట్టలేదు.  

అన్ని ఊళ్లలో సంక్రాంతి సంబరాలు జరుగుతోంటే చింతకుంటలో ఏ సందడీ లేదు. వందగల్లు లక్ష్మి అనే వృద్ధురాలి కుటుంబం ఒకప్పుడు బాగా బతికిందే. ఆమెకు పెద్ద హనుమయ్య, చిన్న హనుమయ్య ఇద్దరు కుమారులు. వారికి నాలుగెకరాల పొలం ఉంది. రెండేళ్లుగా పంటలకు గిట్టుబాటు ధర రాలేదు. సుమారు రూ.3లక్షలు అప్పులయ్యాయి. దీంతో ఆమె ఇద్దరు కుమారులు కర్ణాటక ప్రాంతానికి మిర్చి కోత పనులకు వలస వెళ్లారు.

నన్ను ఇక్కడే వదిలిపెట్టి వెళ్లారు

గతంలో కాలు బాగుండేది. అప్పుడు మా కుటుంబంతో కలిసి వలస వెళ్లేవాడ్ని. ఓ ప్రమాదంలో కాలు విరిగింది. నన్ను ఇంటి వద్దనే వదిలి.. భార్య, బిడ్డ, పిల్లలు గుంటూరుకు సుగ్గికి వెళ్లారు. నాలుగు రూపాయలు సంపాదిస్తేనే.. నాలుగు మెతుకులు లోపలికి వెళ్తాయి. మాలాంటి వాళ్లకు పండుగ జరుపుకోవడం ఎట్లా వీలవుతుంది?

- వెంకన్నగేరి తిక్కయ్య

ఊరు ఖాళీ అవుతోంది

ఒకప్పుడు మా గ్రామం పచ్చని పంటలతో కళకళలా డుతుండేది. అందరికీ పుష్కలంగా పనులు ఉండేవి. రెండేళ్ల నుంచి పంటలు వైరస్‌బారిన పడుతున్నాయి. వచ్చిన దిగుబడికి గిట్టుబాటు ధర ఉండేది కాదు. దీంతో అప్పుల పాలై మా గ్రామంలోని చాలా కుటుంబాలు సుగ్గికి వెళ్లాయి. బాగా బతికిన కుటుంబాలు కూడా ఇళ్లకు తాళాలు వేసుకుని వలస వెళ్తే ఇక మాఊళ్లో సంక్రాంతి సంబరాలు ఎలా ఉంటాయి?                  
 
  ఎర్రదొడ్డి నరసింగప్ప

Updated Date - 2022-01-15T05:03:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising