ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మ్యుటేషన్స్‌కు ప్రత్యేక డ్రైవ్‌: కలెక్టర్‌

ABN, First Publish Date - 2022-08-05T05:15:05+05:30

భూ క్రయ, విక్రయాలు జరిగాక రెవెన్యూ రికార్డులలో మార్పుకు సంబంధించిన మ్యుటేషన్స్‌ దరఖాస్తులను నిర్దేశిత గడువులోగా పరిష్కరించేందుకు ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహి స్తున్నట్లు కలెక్టర్‌ డాక్టర్‌ మనజీర్‌ జిలానీ సామూన్‌ తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నంద్యాల టౌన్‌, ఆగస్టు 4 : భూ క్రయ, విక్రయాలు జరిగాక రెవెన్యూ రికార్డులలో మార్పుకు సంబంధించిన మ్యుటేషన్స్‌ దరఖాస్తులను నిర్దేశిత గడువులోగా పరిష్కరించేందుకు ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహి స్తున్నట్లు కలెక్టర్‌ డాక్టర్‌ మనజీర్‌ జిలానీ సామూన్‌ తెలిపారు. గురువారం విజయవాడలోని భూ పరిపాలన శాఖ ముఖ్య కమిషనర్‌ జి.సాయి ప్రసాద్‌ తన కార్యాలయం నుంచి రాష్ట్రంలోని కలెక్టర్లు, ఇతర ముఖ్య అధికారులతో భూ రికార్డుల స్వచ్ఛీకరణ, రీ సర్వేపై సమీక్షించారు. ఈ సందర్భంగా సీసీఎల్‌ఏ సాయిప్రసాద్‌ మాట్లాడుతూ భూ సమగ్ర రీ సర్వే పనులు అక్టోబరు నెలాఖరు నాటికి పూర్తి చేయాలని అన్ని జిల్లాల కలెక్టర్లకు సూచించారు. జగనన్న శాశ్వత భూ హక్కు - భూ రక్ష పథకం కింద రెవెన్యూ భూముల స్వచ్ఛీకరణ, రీ సర్వే పనులను వేగవంతంగా పూర్తి చేసేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆదేశించారు. అలాగే భూ రికార్డుల స్వచ్ఛీకరణ, గ్రాండ్‌ వ్యాలిడేషన్‌, 13 నోటిఫికేషన్‌, ఓఆర్‌ఐ ప్రక్రియను నిర్ణీత సమయంలోపు పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ డాక్టర్‌ మనజీర్‌ జిలానీ సామూన్‌ మాట్లాడుతూ జిల్లాలోని అన్ని మండలాల్లో మ్యుటేషన్స్‌ దరఖాస్తుల పరిష్కారానికి తహసీల్దార్లతో టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించి త్వరితగతిన పూర్తి చేసేలా ఆదేశాలు జారీ చేశామని అన్నారు. ఈ సమీక్షలో కలెక్టర్‌తో పాటు జేసీ నారపురెడ్డి మౌర్య, ల్యాండ్‌ అండ్‌ సర్వే అధికారులు పాల్గొన్నారు.
 
వంద శాతం గ్రౌండింగ్‌ జరగాలి

జిల్లాలో 2వ విడత  చేపట్టిన మనబడి నాడు - నేడు పనుల్లో పెండింగ్‌లో ఉన్న వాటిలో ఈనెల 10వ తేదీలోపు 100 శాతం గ్రౌండింగ్‌ కావాలని కలెక్టర్‌ డాక్ట ర్‌ మనజీర్‌ జిలానీ సామూన్‌ ఆదేశించారు. గురువా రం విద్యాశాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి రాజశేఖర్‌ విజ యవాడ నుంచి రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌లో సమీక్ష చేశారు. విద్యార్థులకు మె రుగైన సౌకర్యాలు కల్పించేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసు కోవాలని కలెక్టర్లను విద్యాశాఖ కమిషనర్‌ ఆదేశించారు. వందశాతం గ్రౌండింగ్‌, పనుల నాణ్యత విషయంలో ఎక్కడ రాజీ పడరాదని సూచించారు. కలెక్టర్‌ మాట్లా డుతూ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నాడు - నేడు పెండింగ్‌ పనులను పూర్తి చేసేందుకు అన్ని మండలాల ఎంఈవోలతో ప్రతిరోజు పురోగతిపై సమీక్షించాలని డీఈవో వసుంధరను ఆదేశించారు. ఈ వీడియో కా న్ఫరెన్స్‌లో కలెక్టర్‌తో పాటు డీఈవో వసుంధర, విద్యా శాఖ ఏడీ అనూరాధ, సెక్టోరల్‌ అధికారి లలిత  పాల్గొన్నారు.

Updated Date - 2022-08-05T05:15:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising