ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మహానందిలో 16 రోజుల పండుగ

ABN, First Publish Date - 2022-03-17T05:04:35+05:30

మహానంది క్షేత్రంలో 16 రోజుల పర్వదినాన్ని ఆలయ ఈవో చంధ్రశేఖర్‌రెడ్డి ఆధ్వర్యంలో వేదపండితులు ఘనంగా నిర్వహించారు.

రథాన్ని లాగుతున్న భక్తులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మహానంది, మార్చి 16: మహానంది క్షేత్రంలో 16 రోజుల పర్వదినాన్ని ఆలయ ఈవో చంధ్రశేఖర్‌రెడ్డి ఆధ్వర్యంలో వేదపండితులు ఘనంగా నిర్వహించారు. మహానంది మహాశివరాత్రి పర్వదినం పూర్తయిన తర్వాత క్షేత్రంలో 16 పర్వదినం జరపడం ఆనవాయితీ. ఇందులో భాగంగా బుధవారం ప్రధాన ఆలయాల్లో వేదపండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం  రఽఽథశాల వద్దకు మేళతాళాలతో చేరుకొని భక్ష్యాలను నివేదనగా సమర్పించారు.  రథాన్ని రథశాల మంటపంలోకి లాగారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా అంకురార్పణ కార్యక్రమంలో నాటిన విత్తనాలు మెలకలు వచ్చాయి. వీటిని  ఆలయం ప్రాంగణంలోని రుద్రగుండం కోనేరులో కలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, పాలకమండలి సభ్యులు పాల్గొన్నారు. 

 వైభవంగా రథోత్సవం 

నందికొట్కూరు రూరల్‌ : నందికొట్కూరు మండంలం కొణిదేలలో భ్రమరాంబ మల్లికార్జున స్వామావార్ల రథోత్సవం ఎంతో వైభవంగా నిర్వహించారు. బుదవారం కొణిదేలలో కన్నుల పండువగా,  భక్తుల ఆనందోత్సవాల మధ్య ఘనంగా రథోత్సవం నిర్వహించారు.  

బండి ఆత్మకూరు: నల్లమల అటవీ ప్రాంతంలో వెలసిన ఓంకార క్షేత్రంలో 16 రోజుల పర్వదినాన్ని చైర్మన విశ్వనాథరెడ్డి ఆధ్వర్యంలో భక్తిశ్రద్దలతో నిర్వహించారు. బుధవారం శివరాత్రి అనంతరం 16 రోజుల వేడుక ఈవో మోహన నేతృత్వంలో అర్చకు లు రథానికి పూజలు చేసి రథాన్ని కదిలించారు. కార్యక్రమంలో ఎంపీపీ దేరెడ్డి చిన్న సంజీవరెడ్డి, బారెడ్డి శ్రీనివాసరెడ్డి, నారాయణ పాల్గొన్నారు.


Updated Date - 2022-03-17T05:04:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising