వేలం పాటల ద్వారా రూ.40.40 లక్షల ఆదాయం
ABN, First Publish Date - 2022-03-06T05:13:23+05:30
మండలంలోని నందవరం చౌడేశ్వరీమాత ఆలయంలో ఆలయ ఈవో రామానుజన, ఆలయ చైర్మన పీఆర్‌వెంకటేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో శనివారం అమ్మవారికి భక్తులు సమర్పించే (శేష వస్ర్తాలను) చీరలను బహిరంగంగా వేలం నిర్వహిం చారు.
బనగానపల్లె, మార్చి 5: మండలంలోని నందవరం చౌడేశ్వరీమాత ఆలయంలో ఆలయ ఈవో రామానుజన, ఆలయ చైర్మన పీఆర్‌వెంకటేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో శనివారం అమ్మవారికి భక్తులు సమర్పించే (శేష వస్ర్తాలను) చీరలను బహిరంగంగా వేలం నిర్వహిం చారు. నందవరానికి చెందిన తిరుమలయ్య రూ.40.40 లక్షలకు వేలం పాటలో పాల్గొని చీరల వేలాన్ని దక్కించుకున్నారు. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం చీరల వేలం పాటల్లో దేవస్థానానికి రూ.17.39 లక్షల ఆదాయం లభించినట్లు తెలిపారు. ఈవేలం పాటలు దేవాదాయశాఖ ఆలయ ఇనస్పెక్టర్ రఘురాం ఆధ్వర్యంలో నిర్వహించినట్లు ఆలయ ఈవో రామానుజన తెలిపారు.
Updated Date - 2022-03-06T05:13:23+05:30 IST