ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జంట హత్య కేసులో 12 మంది అరెస్టు

ABN, First Publish Date - 2022-01-29T04:48:40+05:30

కౌతాళం మండలం కామవరం గ్రామంలో జరిగిన జంట హత్య కేసులో 12 మంది నిందితులను అరెస్టు చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హత్యలను ప్రోత్సహిస్తే కఠిన చర్యలు
ఎస్పీ సుధీర్‌కుమార్‌రెడ్డి


ఆదోని, జనవరి 28: కౌతాళం మండలం కామవరం గ్రామంలో జరిగిన జంట హత్య కేసులో 12 మంది నిందితులను అరెస్టు చేశారు. శుక్రవారం ఆదోని డీఎస్పీ ఆఫీసులో ఎస్పీ సుధీర్‌ కుమార్‌రెడ్డి నిందితులను విలేఖరుల ఎదుట హాజరుపరిచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ కామవరం జంట హత్యల సంఘటనపై కౌతాళం పోలీస్‌ స్టేషన్‌లో క్రైమ్‌ నం.15/2022 యూ/ఎస్‌ 147, 148, 324, 307, 302 ఆర్‌/డబ్ల్యు 149 ఐపీసీ అండ్‌ సెక్‌.3(1) (ఆర్‌) (ఎస్‌) అండ్‌ 3(1) (వీ) ఆఫ్‌ ఎస్సీ/ఎస్టీ పీఓఏ ఆక్ట్‌ కింద కేసు నమోదు చేశామన్నారు. ఈ కేసు దర్యాప్తు అధికారిగా ఆదోని డీఎస్పీ వినోద్‌ కుమార్‌ వ్యవహరిస్తున్నారని తెలిపారు.  హైదరాబాద్‌లో ఎంజీబీఎస్‌ ఎదుల  మెట్రో రైల్వే స్టేషన్‌లో ఏడుగురిని, ఎమ్మిగనూరు దగ్గర హనుమాన్‌దొడ్డి గ్రామంలో ఐదుగురిని అరెస్టు చేశామన్నారు. వీరి పేర్లు.. మల్లికార్జున, గోపాల్‌, రాజు, ఈశ్వర్‌, చంద్ర, రామాంజనేయులు, రామకృష్ణ, ఉలిగమ్మ, లక్ష్మి, జయమ్మ, ఈరమ్మ, వడ్డె లక్ష్మి.. అని తెలిపారు. మొదటి ఆరుగురు నిందితులు పారిపోవడానికి సహకరించిన బాపురం రామకృష్ణ పరమహంస అలియాజ్‌ చాకలి రామకృష్ణను కూడా అరెస్టు చేశామన్నారు. ఇతనిపై ఐపీసీ 212 సెక్షన్‌ కింద కేసు నమోదు చేశామని తెలిపారు. వీరిని కోర్టులో హాజరుపరుస్తామని తెలిపారు.   ఆదోని డీఎస్పీ వినోద్‌కుమార్‌, సీఐలు వెంకటేశ్వరరావు, సుధాకర్‌రెడ్డి, తబ్రేజ్‌, పార్థసారథి, ఎస్‌ఐలు నరేంద్రకుమార్‌రెడ్డి, గోపాల్‌రెడ్డి, రామయ్య, జి.చంద్ర, శివాంజల్‌, మన్మథవిజయ్‌, సునీల్‌కుమార్‌లను ఎస్పీ అభినందించారు. హత్యలను ప్రోత్సహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, అవసరమైతే జిల్లా నుంచి బహిష్కరిస్తామని అన్నారు.

Updated Date - 2022-01-29T04:48:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising