ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

100 కేసులు దాటాయి

ABN, First Publish Date - 2022-01-13T05:57:16+05:30

జిల్లాలో ఆరు నెలల తర్వాత కరోనా కేసులు వంద దాటాయి. 2021 జూలై 11న జిల్లాలో 117 కేసులు వచ్చాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  1. జిల్లాలో 123 కరోనా పాజిటివ్‌లు
  2. అత్యధికంగా కర్నూలులో 38
  3. ఆదోనిలో 23, నంద్యాలలో 16 
  4.  6 నెలల తర్వాత వంద కేసులు 


   కర్నూలు(హాస్పిటల్‌), జనవరి 12: జిల్లాలో ఆరు నెలల తర్వాత కరోనా కేసులు వంద దాటాయి. 2021 జూలై 11న జిల్లాలో 117 కేసులు వచ్చాయి. ఆ తర్వాత కొవిడ్‌ తీవ్రత తగ్గి కేసులు తగ్గుముఖం పట్టాయి. మళ్లీ ఈ ఏడాది జనవరి 12న 123 కరోనా కేసులు వచ్చాయి. గత 24 గంటల్లో 2,472 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. ఇప్పటి వరకు జిల్లాలో కరోనా కేసుల సంఖ్య 1,24,531కు చేరగా.. యాక్టివ్‌ కేసులు 267 ఉన్నాయి. 

కర్నూలులో 38 కేసులు:  కర్నూలు నగరంలో 475 మందికి శాంపిల్స్‌ సేకరించగా.. 38 కేసులు పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యాయి. ఆదోని మున్సి పాలిటీలో 23,  నంద్యాల మున్సి పాలిటీలో 16, శిరివెళ్లలో 5, బండిఆ త్మకూరులో 4, బేతంచెర్ల రూరల్‌లో 4, గోస్పాడు, ఆళ్లగడ్డ రూరల్‌, కల్లూరు, ఆళ్లగడ్డలో మూడేసి కేసులు వచ్చాయి. పత్తికొండ, చాగలమర్రి, కోడుమూరు, ఆలూరు, కోవెలకుంట్ల రెండు చొప్పున కేసులు నమో దయ్యాయి. ఎమ్మిగనూరు రూరల్‌, మద్దికెర, కోసిగి, ఉయ్యాలవాడ, నంద్యాల రూరల్‌, కర్నూలు రూరల్‌లో ఒక్కొక్కటి వచ్చాయి.  

మరో ఏడుగురు మెడికోలకు..

కర్నూలు మెడికల్‌ కాలేజీలో మరో ఏడుగురు వైద్య విద్యార్థులకు కరోనా నిర్ధారణ అయింది. ఇప్పటి వరకు వైద్యవిద్యార్థులు 19 మంది కరోనా బారిన పడ్డారు. ఇప్పటి వరకు కర్నూలు ప్రభుత్వ బోధనాసుపత్రిలో 29 మంది ఎంబీబీఎస్‌, హౌస్‌ సర్జన్లకు కరోనా సోకింది. మరో రెండు ప్రైవేటు మెడికల్‌ కాలేజీల్లో కూడా వైద్యవిద్యార్థులు కరోనా బారిన పడినట్లు తెలిసింది. జిల్లాలో కరోనా సోకిన వైద్య విద్యార్థుల సంఖ్య 50 దాకా ఉన్నట్లు సమాచారం. ఈ నెల 18 నుంచి ఎంబీబీఎస్‌ పరీక్షలు జరగనుండటంతో వాటిని వాయిదా వేయాలని ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీ వైస్‌ చాన్సలర్‌కు మెయిల్‌ ద్వారా మూడు మెడికల్‌ కాలేజీల వైద్య విద్యార్థులు కోరారు.

కొవిడ్‌ బాధితులకు ఇబ్బంది కలగకూడదు

కర్నూలు(కలెక్టరేట్‌), జనవరి 12: కొవిడ్‌ కేర్‌ సెంటర్లలో బాధితులకు ఇబ్బందులు లేకుండా అన్ని వసతులు కల్పించాలని కలెక్టర్‌ పి.కోటేశ్వరరావు అన్నారు. బుధవారం నగర శివారులోని టిడ్కో కొవిడ్‌ కేర్‌ సెంటర్‌ను ఆయన తనిఖీ చేశారు. కలెక్టర్‌ మాట్లాడుతూ కొవిడ్‌ కేర్‌ సెంటర్ల పరిసర ప్రాంతాలు ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుతూ ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించాలన్నారు. రోగులకు ఇబ్బంది లేకుండా తాగునీరు, విద్యుత, టాయిలెట్స్‌, భోజనం కల్పించాలని అధికారులను ఆదేశించారు. నిరంతరాయంగా విద్యుత సరఫరా ఉండాలన్నారు. కార్యక్రమంలో కర్నూలు నగర పాలక కమిషనర్‌ డీకే బాలాజీ, జాయింట్‌ కలెక్టర్‌ ఎంకేవీ శ్రీనివాసులు పాల్గొన్నారు.

శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పాకు  కరోనా పాజిటివ్‌

ఆత్మకూరురూరల్‌, జనవరి 12: శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డికి కరోనా నిర్ధారణ అయింది. ఈ నెల 8వ తేదీన ఆత్మకూరుకు వచ్చిన ఎమ్మెల్యే శిల్పా శ్వాసకోశ సంబంధ ఇబ్బందులకు గురి కావడంతో మంగళవారం ఆర్టీపీసీఆర్‌ చేయించుకున్నారు ఈ పరీక్షల్లో ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్‌ అని తేలింది. ఈ నెల 8నుంచి ఆత్మకూరులో ఆయన పర్యటించారని, 9న ఆత్మకూరులోని పార్టీ కార్యాలయంలో పీస్‌ కమిటీలో భాగంగా ఉపముఖ్యమంత్రి అంజాద్‌బాషా, కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన, ఎమ్మెల్సీ ఇసాక్‌బాషాతో పాటు నాయకులు, మత పెద్దలతో ఆయన సమావేశం అయ్యారు. ఆయనతో సన్నిహితంగా మెలిగిన వారంతా కరోనా పరీక్షలు చేయించుకోవాలని తెలిపినట్లు మున్సిపల్‌ చైర్‌పర్సన తెలిపారు. 


12,536 మందికి బూస్టర్‌ డోసు 

కర్నూలు(హాస్పిటల్‌), జనవరి 12: జిల్లాలో 12,536 మంది హెల్త్‌కేర్‌ ఫ్రంట్‌లైన వర్కర్స్‌, 60ఏళ్లు దాటిన వారికి బూస్టర్‌ డోసు వేసినట్లు డీఎంహెచవో డా.బి.రామగిడ్డయ్య తెలిపారు. బుధవారం డీఎంహెచవో బ్రాహ్మణకొట్కూరు పీహెచసీని అకస్మికంగా తనిఖీ చేశారు. అక్కడ డీఎంహెచవో బూస్టర్‌ డోసు వేయించుకున్నారు. ఇప్పటి వరకు 7,001  హెల్త్‌కేర్‌ సిబ్బంది, 4,300 మంది ఫ్రంట్‌లైన వర్కర్లు, 1,235 మంది 60 ఏళ్లు దాటిన వారికి బూస్టర్‌ డోసు వేశామన్నారు. 

కొవిడ్‌కు ఉచిత కన్సల్టేషన, మందులు 

కొవిడ్‌ థర్డ్‌ వేవ్‌ ఉధృతి దృష్ట్యా ఉచిత కన్సల్టేషన, మందులు పొందవచ్చని డీఎంహెచవో డా.బి.రామగిడ్డయ్య ఓ ప్రకటనలో తెలిపారు. ఈ-సంజీవని ఓపీడీ యాప్‌ను గూగుల్‌ ప్లే స్టోర్‌ నుంచి డౌనలోడ్‌ చేసుకోవాలన్నారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఆడియో, వీడియో కాల్‌ ద్వారా స్పెషలిస్టుల సేవలు పొందవచ్చన్నారు.  మందులను కూడా ఉచితంగా ఇంటి వద్దకే పంపిణీ చేస్తామన్నారు. 




Updated Date - 2022-01-13T05:57:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising