ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Kurnool: రేపు ఆదోనిలో సీఎం Jagan పర్యటన

ABN, First Publish Date - 2022-07-04T19:34:00+05:30

సీఎం జగన్ రేపు కర్నూలు జిల్లా, ఆదోనిలో పర్యటించనున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కర్నూలు (Kurnool): ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి (Jaganmohan reddy) మంగళవారం కర్నూలు జిల్లా, ఆదోని (Adoni)లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా జగనన్న విద్యా కానుకను  ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి జనసమీకరణ బాధ్యత అధికారులపై పెట్టారు. దీంతో అధికారులు పొదుపు మహిళలకు, ఆర్పీ, రీసోర్స్ పర్సన్‌లకు హెచ్చరికల మెసేజ్‌లు పంపారు. సీఎం సభకు పోదుపు మహిళలు ఖచ్చితంగా రావాలని ఆదేశాలిచ్చారు. రాక పోతే ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందవని, అర్హత కోల్పోతారని హెచ్చరించారు. ఆదోని డివిజన్‌లోని అన్ని ప్రవేట్ స్కూల్ బస్సులను సోమవారం సాయంత్రం లోపు ఆర్టీవో (RTO) అధికారులకు అప్పగించాలంటూ జిల్లా విద్యాశాఖ అధికారులకు ఆదేశాలిచ్చారు. దీంతో ప్రవేట్ స్కూల్ కరస్పాండెంట్‌లకు డిఈవో (DEO) కార్యాలయం నుంచి మెసేజ్‌లు వెళ్లాయి.


సీఎం జగన్ టూర్ షెడ్యూల్....

మంగళవారం ఉదయం 8.30 గంటలకు సీఎం తన నివాసం నుంచి బయలుదేరి 8.50 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. 9 గంటలకు విమానంలో బయలుదేరి 9.50కి కర్నూలు జిల్లా ఓర్వకల్లు ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. 10 గంటలకు హెలికాప్టర్‌లో బయలుదేరి 10.20కి ఆదోని ఆర్ట్స్‌ అండ్‌ సైన్స కళాశాల మైదానానికి చేరుకుంటారు. 10.20 నుంచి 10.30 గంటల వరకు ప్రజల నుంచి వినతులు తీసుకుంటారు. ఇక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా 10.40కి మున్సిపల్‌ క్రీడా మైదానానికి చేరుకుంటారు. 10.45 నుంచి 10.50 వరకు పాఠశాలను సందర్శిస్తారు. 10.55 గంటలకు సభా ప్రాంగణానికి చేరుకుని 11.15 వరకు నాయకులు, అధికారులతో మాట్లాడతారు. 11.15 నుంచి 11.25 వరకు వివిధ పథకాల లబ్ధిదారులు మాట్లాడుతారు. 11.25 నుంచి 12.10 వరకు ముఖ్యమంత్రి ప్రసంగిస్తారు. 12.10 నుంచి 12.20 వరకు జగనన్న విద్యాకానుకను పంపిణీ చేస్తారు. 12.20 గంటలకు మున్సిపల్‌ హైస్కూల్‌ మైదానం నుంచి రోడ్డు మార్గంలో ఆర్ట్స్‌ కళాశాల మైదానానికి చేరుకుంటారు. 12.30 నుంచి 12.45 వరకు స్థానిక నాయకులతో మాట్లాడుతారు. 12.50కు హెలికాప్టర్‌లో బయలుదేరి 1.10 గంటలకు ఓర్వకల్లు ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. 1.20 గంటలకు ఓర్వకల్లు ఎయిర్‌పోర్టు నుంచి విమానంలో బయలుదేరుతారు. మధ్యాహ్నం 2.10 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు.

Updated Date - 2022-07-04T19:34:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising