ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైతులకు శాపంగా వైసీపీ పాలన

ABN, First Publish Date - 2022-12-16T01:39:00+05:30

వైసీపీ పాలన రైతులకు శాపంగా మారిందని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు విమర్శించారు.

కూనపరాజుపర్వలో ధాన్యం కల్లం వద్ద ఆందోళన చేస్తున్న మాజీ మంత్రి దేవినేని ఉమా, స్థానిక నేతలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కూనపరాజుపర్వ(రెడ్డిగూడెం) : వైసీపీ పాలన రైతులకు శాపంగా మారిందని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు విమర్శించారు. కూనపరాజుపర్వలో ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. రైతులు పండించిన ధాన్యాన్ని సకాలంలో కొనుగోలు చేయకపోవడంతో కల్లాల్లో ఉండిపోయి తడిసి మొల కెత్తిందన్నారు. మొలకెత్తిన ధాన్యాన్ని ఆయన పరిశీ లించారు. ఇంటింటికీ తిరిగి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. నేతలు కె.విజయబాబు, ముప్పిడి నాగేశ్వరరెడ్డి, రాయుడు వెంకటేశ్వరరావు, పైడిమర్ల కిరణ్‌కుమార్‌రెడ్డి, జానాలపాటి వేణుగోపా ల్‌రెడ్డి, తన్నీరు మల్లికార్జునరావు పాల్గొన్నారు.

తుమ్మలపాలెం(ఇబ్రహీంపట్నం) : వైసీపీ ప్రభుత్వ అసమర్థత పాలన కారణంగా రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా లేరని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు విమర్శిం చారు. తుమ్మలపాలెంలో గురువారం ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమాన్ని నిర్వహించారు. 14అంశాలతో కూడిన కరపత్రాన్ని ప్రజలకు అందించి వివరాలు నమోదు చేశారు. రైతులు, రైతు కూలీలు, భవన నిర్మాణ రంగ కార్మికులు పనులు లేక ఇబ్బంది పడుతున్నారని ఉమా అన్నారు. నదిలో నాసిరకం చేపలు వేసి మత్స్యకారులను ఎమ్మెల్యే వసంత మభ్యపెట్టారని విమర్శించారు. టీడీపీ సీనియర్‌ నాయకుడు జంపాల సీతారామయ్య, రామినేని రాజశేఖర్‌, చుట్టుకుదురు శ్రీనివాసరావు, కరిమికొండ శ్రీలక్ష్మీ, వల్లూరు జమాయి దేవకుమారి, చెన్ను బోయిన చిట్టిబాబు, చనమోలు నారాయణ రావు, సుంకర విష్ణుకుమార్‌, తాడికొండ రామకృష్ణ, కూచిపూడి దిలీప్‌కుమార్‌ పాల్గొన్నారు.

Updated Date - 2022-12-16T01:39:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising