ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వండర్‌ కిడ్‌

ABN, First Publish Date - 2022-01-24T06:18:12+05:30

వండర్‌ కిడ్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రపంచ మెమొరీ చాంపియన్‌షిప్‌ పోటీల్లో మెరిసిన బెజవాడ చిన్నారి హాసినీ

విజయవాడ కల్చరల్‌, జనవరి 23 : అసాధారణ జ్ఞాపకశక్తితో ఇప్పటికే పలు రికార్డులు సాధించి విజయవాడ ‘వండర్‌ గర్ల్‌’గా పేరొందిన మున్నంగి హాసినీ మరోసారి తన సత్తా చాటింది. డిసెంబరు 18 నుంచి 20 వరకూ జరిగిన ప్రపంచ మెమొరీ చాంపియన్‌ పోటీల్లో అత్యంత క్లిష్టమైన విభాగం స్పోకెన్‌ నెంబర్లలో మన దేశ అభ్యర్థుల్లో ప్రథమ స్థానంలో నిలిచింది. మొత్తం పది విభాగాల్లో పోటీలు జరగ్గా, కిడ్స్‌ కేటగిరీలో పాల్గొన్న హాసినీ అబ్‌ స్టాక్ట్‌ ఇమేజెస్‌లో ద్వితీయ స్థానంలో, నేమ్స్‌ అండ్‌ ఫేసెస్‌, హవర్‌ నెంబర్స్‌ విభాగాల్లో తృతీయ స్థానాల్లో నిలిచింది. ఫలితాలను ఇంకా వరల్డ్‌ మెమొరీ స్పోర్ట్స్‌ కౌన్సిల్‌ ప్రకటించాల్సి ఉంది. నగరంలోని ఐకాన్‌ పబ్లిక్‌ స్కూల్‌లో 6వ తరగతి చదువుతున్న హాసినీ తొలిసారిగా ప్రపంచ మెమొరీ చాంపియన్‌షిప్‌ పోటీల్లో పాల్గొనడం విశేషం. హాసినీ.. నగర పోలీస్‌ కమిషనర్‌ ఆఫీసులో పనిచేస్తున్న ఉమాశంకర్‌, జ్యోతి కుమార్తె. ఇప్పటికే ఐదుసార్లు ప్రపంచ రికార్డులు సాధించింది. 

Updated Date - 2022-01-24T06:18:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising