రైతులకు న్యాయం జరిగేలా చూస్తాం
ABN, First Publish Date - 2022-12-16T01:23:55+05:30
రైతులకు న్యాయం జరిగేలా చూస్తామని జాయింట్ కలెక్టర్ అపరాజిత సింగ్ అన్నారు. గురువారం మోపిదేవి మండలంలోని మోపి దేవిలంక, నాగాయితిప్ప, కోసూరువారిపాలెంలో పర్యటించి, మాండస్ తుఫాను ప్రభావంతో కురిసిన వర్షాలకు దెబ్బతిన్న వరి, కూరగాయల పంటలను ఆమె పరిశీలించారు.
వర్షాలకు దెబ్బతిన్న పంటల పరిశీలనలో జాయింట్ కలెక్టర్
మోపిదేవి/కోడూరు, డిసెంబరు 15: రైతులకు న్యాయం జరిగేలా చూస్తామని జాయింట్ కలెక్టర్ అపరాజిత సింగ్ అన్నారు. గురువారం మోపిదేవి మండలంలోని మోపి దేవిలంక, నాగాయితిప్ప, కోసూరువారిపాలెంలో పర్యటించి, మాండస్ తుఫాను ప్రభావంతో కురిసిన వర్షాలకు దెబ్బతిన్న వరి, కూరగాయల పంటలను ఆమె పరిశీలించారు. కూరగాయల పంటలకు ఇప్పటికే రూ.50 వేలకుపైగా పెట్టుబడి పెట్టామని, ప్రభుత్వం న్యాయం చేసేలా చూడాలని రైతులు ఆమె దృష్టికి తీసుకొచ్చారు. పంట నష్టాన్ని ప్రభుత్వం నమోదు చేసిందని, సమస్యలు ఉంటే గ్రామాల్లోని ఆర్బీకేల్లో పేర్లు నమోదు చేసుకోవాలని జేసీ సూచించారు. తహసీల్దార్ నవీన్‌కుమార్, వీఆర్వోలు ఉన్నారు. కోడూరు మండలంలో తడిసిన వరి పన లను, దిగువ ప్రాంత భూములను జేసీ పరిశీలించారు. మాచవరం, హంసల దీవి, పాలకాయితిప్ప, దింటిమెరక గ్రామాల సమీపంలో నీట మునిగిన పంట పొలాలను, ఉప్పు నీటి వల్ల బీడు మారిన సాగు భూములను ఆమె పరిశీలిం చారు. ఎమ్మెల్యే సింహాద్రి రమేష్‌బాబు వర్షాల కారణంగా దెబ్బతిన్న పంటల వల్ల రైతుకు జరిగే నష్టం, కోడూరు దిగువ ప్రాంతంలో మూడేళ్లుగా రైతులు పడుతున్న ఇబ్బందులు, సాగు భూమి బీడు భూములుగా మారటానికి కార ణమైన అవుట్ ఫాల్ స్లూయిస్‌పై జేసీకి వివరించారు. తహసీల్దార్ ఎస్.కె.లతీఫ్ పాషా, జడ్పీటీసీ యాదవరెడ్డి వెంకట సత్యనారాయణ, కొండవీటి వెంకట నారా యణ, పరిశె మాధవరావు, భానుప్రకాష్ పాల్గొన్నారు.
భూసర్వేపై జేసీ అసంతృప్తి
కూచిపూడి: జాయింట్ కలెక్టర్ అపరాజిత్ సింగ్ మొవ్వ మండలం అయ్యంకిలో భూ సర్వే పనులను, మొవ్వలో నీళ్లలో నానుతున్న వరి పనలను, నిడుమోలులో నాడు - నేడు ద్వారా రెండో విడత పాఠశాలలో జరుగుతున్న పనులను పరిశీలించారు. అయ్యంకిలో భూసర్వే తీరుపై అసంతృప్తిని వ్యక్తం చేశారు. బార్లపూడి, పెడసనగల్లు, అయ్యంకి, చినముత్తేవి, ఆవిరిపూడి, పెదము త్తేవి గ్రామాల్లో 10,323 ఎకరాలకు ఇంకా 5255 ఎకరాలు సర్వే చేయాల్సి ఉందని, నత్తనడకగా చేస్తే ఫిబ్రవరి ఆఖరుకు కూడా పూర్తి కాదని అన్నారు. భూసర్వే ఏడీ గోపాలరావు, తహసీల్దార్ సీహెచ్ వీరాంజనేయప్రసాద్, సర్వేయర్ కిషోర్‌బాబు, ఏవో శివప్రసాద్ పాల్గొన్నారు.
Updated Date - 2022-12-16T01:23:55+05:30 IST