ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

PM Modi భీమవరం పర్యటనలో Black balloons ఎగరవేయడంపై Police సీరియస్

ABN, First Publish Date - 2022-07-04T20:14:22+05:30

ప్రధాని మోదీ భీమవరం వెళుతున్న సమయంలో హెలికాఫ్టర్‌ ముందు నల్ల బెలూన్‌లు లు ఎగరవేయడంపై పోలీసులు సీరియస్ అయ్యారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ (Vijayawada): ప్రధాని మోదీ (PM Modi) భీమవరం (Bhimavaram) వెళుతున్న సమయంలో హెలికాఫ్టర్‌ ముందు నల్ల బెలూన్‌ (Black balloons)లు ఎగరవేయడాన్ని పోలీసులు (Police) అత్యంత సీరియస్‌గా తీసుకున్నారు. బెలూన్లు ఎగరవేయడాన్ని ప్రధాని భద్రతా పరంగా ఎస్‌పీజీ అధికారులు సీరియస్‌గా పరిగణించారు. ఇంటెలిజెన్స్‌, ఎస్‌బీ అధికారుల నిఘా వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోందని పోలీస్‌ ఉన్నతాధికారులు అన్నారు. భవనంపైకి ఏ విధంగా వెళ్లారన్నదానిపై  స్థానిక పోలీసులు విచారణ జరుపుతున్నారు. బెలూన్‌లను ఎగరవేసిన సంఘట స్థలానికి వెళ్లి  పోలీసులు విచారణ ప్రారంభించారు. 


కాగా ప్రధాని మోదీ పర్యటనలో కాంగ్రెస్‌ నిరసనలపై ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోమువీర్రాజు మండిపడ్డారు. హెలికాప్టర్ సమీపంలో బెలూన్లు ఎగురవేయడం వెనక కుట్ర ఉందని, ప్రధాని మోదీపై కుట్రలు జరుగుతున్నాయని అన్నారు. ఈ ఘనటపై కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేస్తామన్నారు.


గన్నవరం ఎయిర్ పోర్టు సమీపంలోని ఓ బిల్డింగ్ మీద నుంచి కాంగ్రెస్ నేతలు బెలూన్లు వదిలారు. ఏపీసీసీ ప్రధాన కార్యదర్శి రాజీవ్ రతన్ నేతృత్వంలో కొందరు యువకులు నల్ల బెలూన్లు వదిలారు. కాగా సోమవారం ఉదయం గన్నవరం ఎయిర్ పోర్టు వద్ద కాంగ్రెస్ మహిళా నేత సుంకర పద్మ శ్రీ, ఎమ్మార్పీఎస్ నేతలు.. ఎయిర్ పోర్టు సమీపంలో నిరసన తెలిపే ప్రయత్నం చేశారు. దీంతో వారిని పోలీసులు అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. 

Updated Date - 2022-07-04T20:14:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising