ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Modi పాలనలో సామాన్య ప్రజలే ఎక్కువగా ఇబ్బంది పడ్డారు: Narayana

ABN, First Publish Date - 2022-06-05T18:53:23+05:30

మోదీ (Modi) పాలనలో సామాన్య ప్రజలే ఎక్కువగా ఇబ్బంది పడ్డారని కె.నారాయణ అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

Vijayawada: మోదీ (Modi) పాలనలో సామాన్య ప్రజలే ఎక్కువగా ఇబ్బంది పడ్డారని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ (Narayana) అన్నారు. ఆదివారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ నోట్ల రద్దుతో బ్లాక్ మనీ కాస్త వైట్‌గా మార్చేసుకున్నారన్నారు. మోదీ విధానాలతో డ్రగ్ మాఫియా ఆగిందా?.. సర్జికల్ స్ట్రైక్‌తో దేశంలో ఉగ్రవాదం తగ్గిందా? అని ప్రశ్నించారు. జాతికి మోదీ క్షమాపణలు చెప్పాలన్నారు. బొగ్గు ఉత్పత్తి కావాలనే మోదీ ప్రభుత్వం తగ్గించిందని, అదానికి మేలు చేసేందుకు ఈ చర్య చేపట్టిందని ఆరోపించారు. ఆదానికి బొగ్గు ఉత్పత్తి కేంద్రాలు ఉన్నాయన్నారు. గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు దృష్టిలో పెట్టుకుని ప్రజలు ఓటు వెయ్యాలని పిలుపిచ్చారు.


14 మంది ప్రధానులు కలిసి రూ. 40 లక్షల కోట్ల అప్పు చేస్తే... మోదీ ఒక్కరే రూ. 80 లక్షల కోట్లు అప్పు చేశారని నారాయణ అన్నారు. జాతీయ స్థాయిలో బీజేపీకి వ్యతిరేకంగా ఉద్యమ కార్యాచరణ చేపడతామన్నారు. హడావిడిగా సీఎం జగన్ ఢిల్లీ వెళ్లి లోపల ఎం చేశారో ఎవరికీ తెలియదన్నారు. పోలవరం నిర్వాసితులకు ఇవ్వాల్సిన పరిహారం, నిధులు ఏమి అడగలేదన్నారు. జగన్‌ను నమ్మి రాష్ట్ర ప్రజలు 22 లోక్ సభ సీట్లు ఇస్తే ఎం సాధించారని ప్రశ్నించారు. హోదాపై ప్రగల్బాలు పలికిన జగన్ ఢిల్లీకి వెళ్లి సాధించింది ఏమి లేదని ఎద్దేవా చేశారు. ఎన్టీఆర్ ఆత్మగౌరవానికి ప్రతీకని, ఢిల్లీ నాయకులను ఎదిరించి నిలబడిన వ్యక్తి అని కొనియాడారు. జగన్ తెలుగు వారి ఆత్మగౌరవాన్ని మోదీ కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టారని దుయ్యబట్టారు. జగన్ దావోస్ పర్యటనలో ఒక్క కొత్త కంపెనీ రాలేదని విమర్శించారు. మూడు రాజధానుల ప్రకటనతో పెట్టుబడిదారులంతా వెళ్లిపోయారని నారాయణ అన్నారు.

Updated Date - 2022-06-05T18:53:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising