ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Vijayawada: ఇంద్రకీలాద్రిపై అధికారుల తీరు వివాదాస్పదం..

ABN, First Publish Date - 2022-09-29T20:22:55+05:30

ఇంద్రకీలాద్రిపై అధికారుల తీరు వివాదాస్పమవుతోంది. కుంకుమ పూజలో కూర్చున్న ఉభయ దాతలను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారనే..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ (Vijayawada): ఇంద్రకీలాద్రిపై అధికారుల తీరు వివాదాస్పమవుతోంది. కుంకుమ పూజలో కూర్చున్న ఉభయ దాతలను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఒకప్పుడు తమను గౌరవించి పూజలు చేయించేవారని, ఇప్పుడు కనీసం పట్టించుకునేవారుకూడా లేరని ఉభయ దాతలు ఆరోపిస్తున్నారు. శరన్నవరాత్రుల్లో భాగంగా అమ్మవారి కుంకుమ పూజా కార్యక్రమాలు ఎంతో విశిష్టంగా జరుగుతాయి... ఈ సందర్బంగా భక్తులు ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ గత 35 ఏళ్లుగా అమ్మవారి కుంకు పూజ చేస్తున్నామని.. ఎంతో ఘనంగా జరిగేవని అన్నారు. ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతరాలయ దర్శనం కల్పించడంలేదని, టిక్కట్ తీసుకుని వచ్చినా.. తమకు చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయని అన్నారు. రూ. 3వేల టిక్కెట్ తీసుకుని కింద నుంచి కొండపైకి రావడానికి చాలా ఇబ్బందులు పడుతున్నామన్నారు. ప్రతి ఏడాది  లిఫ్ట్ ద్వారా పైకి వచ్చేవాళ్లమని, ఇప్పుడు ఆ సౌకర్యంలేదని, ఈ వయసులో కింద నుంచి పైకి మెట్లు ఎక్కి రావడానికి చాలా ఇబ్బందులు పడాల్సి వస్తోందన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తమకు ప్రశాంతంగా కుంకుమపూజ కార్యక్రమాలు నిర్వహించి, అంతరాలయ దర్శనం కల్పించాలని కోరుతున్నామని వారన్నారు.

Updated Date - 2022-09-29T20:22:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising