ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విద్యారంగ సమస్యలు పరిష్కరించాలి

ABN, First Publish Date - 2022-08-19T06:30:49+05:30

విద్యారంగ సమస్యలు పరిష్కరించాలి

ఉయ్యూరులో విద్యాసంస్థల బంద్‌ పోస్టర్‌ను ఆవిష్కరిస్తున్న ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఉయ్యూరు, ఆగస్టు 18 : విద్యా రంగ సమస్యలు పరిష్కారం కోరు తూ, ఈనెల 23న రాష్ట్రవ్యాప్తంగా తలపెట్టిన విద్యా సంస్థల బంద్‌ను జయప్రదం చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి పి. పవన్‌కుమార్‌ అన్నారు.  స్థానిక ఏజీఅండ్‌ఎస్‌జీఎస్‌ కళాశాల వద్ద బంద్‌ వాల్‌ పోస్టర్‌ను గురువారం విడుదల చేశారు. ఈ సం దర్భంగా  మాట్లాడుతూ, విద్యా రంగ సమస్యలు పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైంద న్నారు. విద్యా సంవత్సరం ప్రారంభమై రెండు నెలలు గడుస్తున్నా పూర్తిస్థాయిలో  పాఠ్య పుస్తకాలు, యూనిఫామ్‌, జగనన్న విద్యాకానుక అందజేయలేకపోయిందని విమర్శించారు. విశ్వ విద్యాలయాల్లో ఖాళీగా ఉన్న ప్రొఫెసర్‌ పోస్టులు  భర్తీ చేసి విద్యార్థులకు నాణ్యమైన విద్య అందిం చాలని డిమాండ్‌ చేశారు. కొత్తగా ఏర్పాటు చేసిన ప్రభుత్వ మహిళా జూనియర్‌ కళాశాలల్లో సరైన వసతి సదుపాయాలు కల్పించాలన్నారు. మూడు నాలుగు, ఐదు తరగతులు జిల్లా పరిషత్‌ హైస్కూళ్లలో విలీనం ప్రక్రియ నిలిపివేయాల న్నారు.  ఈ కార్యక్రమంలో ఉయ్యూరు కమిటీ నాయకులు బాషా, ప్రేమ్‌, అనిల్‌, జగదీశ్‌, భార్గవ్‌, చందు, కుమార్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-08-19T06:30:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising