ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైసీపీ గడప గడపకూ.. అడుగడుగునా సమస్యలు!

ABN, First Publish Date - 2022-08-06T06:30:25+05:30

వైసీపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గడప గడప మన ప్రభుత్వంలో స్థానికుల నుంచి అడుగడుగనా సమస్యలు వెల్లువెత్తుతున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పెజ్జోనిపేట, ఆగస్టు 5 : వైసీపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గడప గడప మన ప్రభుత్వంలో స్థానికుల నుంచి అడుగడుగనా సమస్యలు వెల్లువెత్తుతున్నాయి. స్థానిక 35వ డివిజన్‌లోని పెజ్జోనిపేట మసీదు సెంటర్‌ నుంచి డేవిడ్‌ వీధి, కిరసనాయలు లింగయ్య వీధి, పీటర్‌ వీధి, కట్టరోడ్డు ప్రాంతంలో శుక్రవారం స్థానిక ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాసరావు గడప గడప మన ప్రభుత్వం నిర్వహించారు. ఇంటి పట్టా ఇచ్చి ఏళ్లు గడుస్తున్నా ఇల్లు ఎక్కడంటూ ఓ మహిళ ఇంటిపట్టా ఎమ్మెల్యే చేతికిచ్చి ప్రశ్నించింది. కట్టరోడ్డులోని ఔట్‌ఫాల్‌ డ్రెయున్‌ వల్ల తీవ్ర సమస్యలు నెలకొంటున్నా పట్టించుకునే నాథుడు లేడని ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లారు.  టిడ్కో ఇంటికి కట్టిన డిపాజిట్లు ఎప్పుడు వస్తాయని స్థానికులు ఎమ్మెల్యేను ప్రశ్నించారు. పెన్షన్లు, ఇల్లు తమకు రాలేదని కొంతమంది స్థానికులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లారు. ఇంతలో స్థానిక ప్రజాప్రతినిధి కుమారుడు అమ్మో కట్టరోడ్డు వద్దంటూ ఎమ్మెల్యేను వెనక్కి తిప్పి ప్రక్కసందులోకి వెళ్లేందుకు చుట్టూ తిప్పుకుంటూ తీసుకెళ్లడంపై కట్టరోడ్డు వాసులు మండిపడుతున్నారు. సమస్యలపై ఎక్కడ నిలదీస్తామోనని ఇటువైపు రాకుండా వెళ్లిపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నేతలు, కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2022-08-06T06:30:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising