ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వందే భారత్‌.. విజయవాడకేదీ?

ABN, First Publish Date - 2022-10-17T06:18:12+05:30

వందే భారత్‌.. విజయవాడకేదీ?

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దేశంలో రెండో అతిపెద్ద జంక్షన్‌కు అన్యాయం

ఆదాయం భారీగా వస్తున్నా.. రాని కొత్త రైళ్లు

ఉత్తరాది రాష్ర్టాలకే హై స్పీడ్‌ సర్వీసులు

అన్ని అవకాశాలూ ఉన్నా విజయవాడకు కేటాయించరు


(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : దేశంలోనే జెట్‌ హైస్పీడ్‌ సూపర్‌ ట్రైన్‌గా పేరొందిన ‘వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌’ను విజయవాడ రైల్వే జంక్షన్‌కు కేటాయించకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దక్షిణాది రాష్ర్టాల్లో ప్రయాణికుల పరంగా ఆదాయం భారీగా ఇస్తున్న డివిజన్లలో విజయవాడ ముందు వరుసలో ఉంది. అలాంటిది.. విజయవాడకు కాకుండా, ఇప్పటి వరకు దేశంలో ఉత్తరాది ప్రాంతాలకే వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌లు కేటాయించారు. గంటకు 160 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోయే ఈ ఎక్స్‌ప్రెస్‌ను డిమాండ్‌ లేని ఒకటి రెండు ఉత్తరాది రూట్లలో నడుపుతున్నారు. 

ఉత్తరాదిపైనే మమకారం

దక్షిణాదిలో దేశంలోనే రెండో అతిపెద్ద రైల్వే జంక్షన్‌గా విజయవాడ ఉంది. ఇక్కడి నుంచి రోజూ 400 పైగా రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి. ఆదాయం కూడా భారీగా వస్తుంది. కానీ, ఆ మేరకు కేంద్ర ప్రభుత్వం విజయవాడ మీద దృష్టి పెట్టట్లేదు. వందే భారత్‌ల కేటాయింపు చూస్తే మొట్టమొదటిసారిగా ఢిల్లీ-కాన్పూర్‌-అలహాబాద్‌-వారణాసి మార్గంలో ప్రవేశపెట్టారు. రెండోది ఢిల్లీ-కాత్రా మార్గంలో నడుస్తోంది. మూడో దానిని ముంబయి-అహ్మదాబాద్‌ మధ్య ప్రవేశ పెట్టారు. నాల్గోది ఇటీవలే హిమాచల్‌ ప్రదేశ్‌లోని వూనా నుంచి న్యూఢిల్లీ మార్గంలో ప్రవేశపెట్టారు. నాలుగు రూట్లను కూడా ఉత్తరాది రాష్ర్టాలు, జోన్లు, డివిజన్లకే కేటాయించారు. ఐదోది చెన్నై-బెంగళూరు మధ్య నడుపుతామని చెబుతున్నారు. 

విజయవాడకే ఎందుకు..?

వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ను నడపటానికి ప్రయాణికుల డిమాండ్‌, హై స్పీడ్‌ ట్రాక్‌ తప్పనిసరి. ఈ రెండూ విజయవాడకు ఉన్నాయి. విజయవాడ నుంచి సికింద్రాబాద్‌, చెన్నైకు హై స్పీడ్‌ ట్రాక్‌ ఉంది. గంటకు 130 కిలోమీటర్ల వేగంతో నడిచేందుకు ఈ రెండు మార్గాల్లో అనుమతులున్నాయి. కానీ, అంతకంటే వేగంగా రైళ్లు నడిపేందుకు కూడా అవకాశాలు ఉన్నాయి. వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ గరిష్ట వేగం గంటకు 160 కిలోమీటర్లే అయినా.. 150 కిలోమీటర్ల వేగంతోనే నడుస్తుంది. దీనివల్ల ఆ రైలు విజయవాడకు నడిచేందుకు అన్ని అవకాశాలు ఉన్నాయి. ఈ దిశగా రాజకీయ పార్టీలు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉంది.  


Updated Date - 2022-10-17T06:18:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising