ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రొఫెసర్‌ సాయిబాబాను విడుదల చేయాలి

ABN, First Publish Date - 2022-10-17T06:33:45+05:30

ప్రొఫెసర్‌ జీఎన్‌ సాయిబాబా తదితరులపై ‘ఉ పా’ కేసులో జిల్లాకోర్టు విధించిన యావజ్జీవ శిక్షను ఏడేళ్ల విచారణానంతరం మ హారాష్ట్ర హైకోర్టు తీర్పుపై సహజ సూత్రాలకు విరుద్ధంగా సుప్రీంకోర్టు స్టే ఇవ్వడాన్ని ఉపా రద్దు పోరాట కమిటీ వ్యతిరేకించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఉపా రద్దు పోరాట కమిటీ

ధర్నాచౌక్‌, అక్టోబరు 16 : ప్రొఫెసర్‌ జీఎన్‌ సాయిబాబా తదితరులపై ‘ఉ పా’ కేసులో జిల్లాకోర్టు విధించిన యావజ్జీవ శిక్షను ఏడేళ్ల విచారణానంతరం మ హారాష్ట్ర హైకోర్టు తీర్పుపై సహజ సూత్రాలకు విరుద్ధంగా సుప్రీంకోర్టు స్టే ఇవ్వడాన్ని ఉపా రద్దు పోరాట కమిటీ వ్యతిరేకించింది. సుప్రీం కోర్టు ఇచ్చిన స్టేను రద్దు చేసి సాయిబాబా తదితరులను విడుదల చేయాలని డిమాండ్‌ చేసింది. గాంధీనగర్‌లోని ప్రెస్‌క్లబ్‌లో ఆదివారం ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో పౌరహక్కుల సంఘం నేత టి.ఆంజనేయులు, ఓపీడీఆర్‌ రాష్ట్ర ప్రధానకార్యదర్శి హనుమంతరావు, పీవోడబ్ల్యూ రాష్ట్ర అధ్యక్షురాలు ఆర్‌.గంగాభవానీ, ఇప్ట్యూ రాష్ట్ర ప్రధానకార్యదర్శి కె.పోలారి, ఐఏపీఎల్‌ నేత శ్రీనివాసరావు మాట్లాడారు. తమ సమస్యలపై పోరాడే ప్రజలకు ప్రజాస్వామికవాదుల మద్దతు అందకుండా చేసేందుకు మేధావులను నిలువరించేందుకు ఉపా లాంటి క్రూరమైన చట్టాలను తీసుకురావడం, భీమా కోరేగావ్‌ వంటి అక్రమ కేసులు బనాయించడం చేస్తున్న కేంద్ర ప్రభుత్వ, అరెస్సెస్‌ విధానాలకు సుప్రీం కోర్టు మద్దతివ్వడం శోచనీయమన్నారు.  స్టే రద్దు కోరుతూ ఈ నెల 2న రాష్ట్రవ్యాప్త ధర్నాలు నిర్వహిస్తామని, త్వరలో రాష్ట్రస్థాయి సదస్సు నిర్వహిస్తామన్నారు. పీకేఎస్‌ నేత కోటేశ్వరరావు, ఇప్ట్యూ నేత రామకృష్ణ, విరసం నేత కిరణ్‌, పీడీఎ్‌సయూ నేత ఏ.రవిచంద్ర, పీడీఎం నేత క్రాంతికుమార్‌, సీఎమ్మెస్‌ నేత ఎం.లక్ష్మీ, పీవోడబ్ల్యూ నేత పద్మ పాల్గొన్నారు.

Updated Date - 2022-10-17T06:33:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising