ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉల్లంఘనులు!

ABN, First Publish Date - 2022-09-11T06:25:33+05:30

ఉల్లంఘనులు!

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- ఆఫర్ల పేరుతో వినియోగదారులకు కుచ్చుటోపీ

- లీగల్‌ మెట్రాలజీ మెరుపుదాడులతో బట్టబయలు

- టాప్‌ బ్రాండ్‌ మార్కెట్స్‌, మార్ట్‌లలో 94 కేసుల నమోదు 

- ప్యాకేజీ కమోడిటీ రూల్స్‌ ఉల్లంఘనలతో మోసాలు 

విజయవాడ, సెప్టెంబరు 10 (ఆంధ్రజ్యోతి) : సూపర్‌ మార్కెట్లు, మార్ట్‌ల్లో వినియోగదారులను మోసం చేస్తున్నారన్న ఫిర్యాదులతో శనివారం లీగల్‌ మెట్రాలజీ కంట్రోలర్‌ కేఆర్‌ఎం కిశోర్‌ కుమార్‌ బడా మాల్స్‌లో విస్తృత తనిఖీలకు ఆదేశించారు. దీంతో లీగల్‌ మెట్రాలజీశాఖకు సంబంధించిన ముగ్గురు జాయింట్‌ కంట్రోలర్లు, ఏడుగురు డిప్యూటీ కంట్రోలర్లు, 19 మంది ఆసిస్టెంట్‌ కంట్రోలర్లు, 21 మంది ఇన్‌స్పెక్టర్లతో కూడిన బృందాలు విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో ఏక కాలంలో దాడులు నిర్వహించారు. విజయవాడలో డిప్యూటీ కంట్రోలర్‌ కృష్ణచైతన్య నేతృత్వంలోని బృందాలు నగరంలో ఏక కాలంలో సూపర్‌ మార్కెట్లు, మార్ట్‌లలో దాడులు నిర్వహించాయి. విజయవాడ నగరంలో క్యాపిటల్‌ సూపర్‌ మార్కెట్‌, డీమార్ట్‌, మెట్రో, రిలయన్స్‌ మార్ట్‌, రత్నదీప్‌ సూపర్‌ మార్కెట్‌, ఉషోదయ సూపర్‌ మార్కెట్‌, వాల్‌ మార్ట్‌ (ఫ్లిప్‌కార్ట్‌)లలో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. రికార్డు స్థాయిలో కేసులు నమోదయ్యాయి. లీగల్‌ మెట్రాలజీ ప్యాకేజీ కమోడిటీ రూల్స్‌ అతిక్రమించినందుకు 92 కేసులు, లీగల్‌ మెట్రాలజీ చట్ట ఉల్లంఘనలు గుర్తించి 2 కేసులు చొప్పున మొత్తం 94 కేసులను నమోదు చేయటం జరిగింది. ఈ కేసులను చూస్తే ఏ స్థాయిలో నగరంలోని సూపర్‌ మార్కెట్స్‌, మార్ట్‌లలో మోసాలు జరుగుతున్నాయో అర్థమౌతోంది. ప్యాకేజీ కమోడిటీ రూల్స్‌ అతిక్రమణలు పెద్ద సంఖ్యలో ఉన్నాయి. సూపర్‌ మార్కెట్లు, మార్ట్‌లలో అన్నీ ప్యాకింగ్‌లోనే ఉంటాయి. వీటిలో నిబంధనలను అడ్డగోలుగా అతిక్ర మించటం జరిగింది. ప్యాకింగ్స్‌ రూల్స్‌ పాటించకపోవటం, నిర్ణీత ప్రామాణికాలు పాటించకపోవటం, కొలతల ప్రకారం ప్యాకింగ్‌ లేకపోవటం, రీ ప్యాకింగ్‌ చేయటం, నిర్దేశించిన గ్రాములు, ఎంఎల్‌లకు భిన్నంగా ప్యాకింగ్‌ చేయటం వంటి వన్నీ కమోడిటీ రూల్స్‌ కిందకు వస్తాయి. ఈ రూల్స్‌ను నగరంలోని సూపర్‌ మార్కెట్లు, మార్ట్‌లు పాటించటం లేదు. మరోవైపు సూపర్‌ మార్కెట్లలో ఆఫర్ల పేరుతో తక్కువకు ఇస్తున్నట్టుగా ప్రచారం చేసుకుంటున్నాయి. ఇవన్నీ కమోడిటీ రూల్స్‌కు భిన్నంగా ఉంటున్నాయి.

Updated Date - 2022-09-11T06:25:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising