ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రోడ్డు భద్రతపై ఔత్సాహిక యువతకు శిక్షణ

ABN, First Publish Date - 2022-08-09T06:52:24+05:30

రోడ్డు భద్రతపై ఔత్సాహిక యువతకు శిక్షణ

రహదారి భద్రత పోస్టర్లను ఆవిష్కరిస్తున్న కలెక్టర్‌ దిల్లీరావు, డీటీసీ పురేంద్ర తదితరులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వన్‌టౌన్‌, ఆగస్టు 8: రోడ్డు భద్రతపై కళాశాలల్లో ఔత్సాహితక విద్యార్థులకు శిక్షణ ఇస్తామని కలెక్టర్‌ దిల్లీరావు తెలిపారు. సోమవారం ఎన్‌టీఆర్‌ జిల్లా కలెక్టరేట్‌లో ఆయన రోడ్డు భద్రతపై అవగాహన కల్పించే పోస్టర్లను ఆవిష్కరించారు. జిల్లాలో 120  కళా శాలలు, 18 ఇంజనీరింగ్‌ కళాశాలల్లోని ఔత్సాహికులకు రోడ్డు భద్రత మార్గదర్శకాలపై అవగాహన కల్పించి, ప్రత్యేక శిక్షణ ఇస్తామన్నారు. రహదారి భద్రత విద్యార్థుల పాత్ర అనే అంశం ప్రాతిపదికన కార్య క్రమాలను నిర్వహించనున్నట్లు తెలిపారు. జిల్లాలో నెలకు 100 నుంచి 120 రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని, 20 మంది మర ణిస్తున్నారని తెలిపారు, కుటుంబంలో ఎవరైనా రోడ్డు ప్రమాదంలో మరణిస్తే మొత్తం వీధిన పడే పరిస్థితి ఉందన్నారు. ప్రమాదాల నివారణ కార్యక్రమాల్లో రవాణా, పోలీసు, ఇంజనీరింగ్‌ మెడికల్‌ విభా గాలతో పాటు స్వచ్ఛంద సంస్థలు కూడా పాలు పంచుకోవాలన్నారు. ఉపరవాణా కమిషనర్‌ పురేంద్ర మాట్లాడుతూ.. ఈనెల మూడో వారం నుంచి కళాశాలల్లో విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు ఉంటాయన్నారు. లైసెన్సు పొందడం, వేగ నియంత్రణ. డ్రైవింగ్‌ లైసెన్సు లేకుండా, సీట్‌ బెల్ట్‌, హెల్మెట్లు పెట్టుకోకుండా వాహనాలు నడిపితే కలిగే అనర్థాలపై శిక్షణ ఇస్తామన్నారు. ప్రతి కళాశాల నుంచి 20 నుంచి 25 మందిని ఎంపిక చేసి శిక్షణ ఇచ్చి వలంటీర్లుగా తయారు చేస్తామన్నారు. సూట్స్‌ కేర్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ సీఈవో డాక్టర్‌ సోమశేఖరరెడ్డి, వీడు రోడ్‌ సేఫ్టీ స్వచ్ఛంధ సంస్థ వ్యవస్థాపక డైరెకర్‌ ఎం.వాసు, ఎంఐవీ వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.



Updated Date - 2022-08-09T06:52:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising