ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ట్రాఫిక్‌ మళ్లింపు..

ABN, First Publish Date - 2022-12-15T00:55:31+05:30

గురువారం నుంచి ఈనెల 20వ తేదీ వరకు భవానీ దీక్షల విమరణ ప్రారంభంతో ఇంద్రకీలాద్రి చుట్టుపక్కల పోలీసులు ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. ఆంక్షలు బుధవారం రాత్రి నుంచి అమలులో ఉంటాయని కమిషనర్‌ టి.కాంతిరాణా పేర్కొన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

(ఆంధ్రజ్యోతి - విజయవాడ)

ఇంద్రకీలాద్రిపై గురువారం నుంచి ప్రారంభం కానున్నది. భవానీల మండల, అర్ధమండల దీక్షల విరమణ ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. తెలుగు రాష్ట్రాలతోపాటు తమిళనాడు, కర్ణాటక, ఒడిసా నుంచి దాదాపుగా 7 లక్షల మంది భవానీ భక్తులు ఇంద్రకీలాద్రికి వస్తారని అంచనా కాగా.. రైల్వేస్టేషన్‌, పున్నమిఘాట్‌, భవానీఘాట్‌ నుంచి ఇంద్రకీలాద్రికి అధికారులు బస్సు సర్వీసులు ఏర్పాటు చేశారు.

ఫ విజయవాడ నుంచి హైదరాబాద్‌, జగ్గయ్యపేట, తిరువూరు వెళ్లే ఆర్టీసీ బస్సులు పీఎన్‌బీఎస్‌ అవుట్‌గేట్‌, వారధి జంక్షన్‌, స్ర్కూబ్రిడ్జి, బెంజ్‌సర్కిల్‌ కొత్త ఫ్లైఓవర్‌, రామవరప్పాడు రింగ్‌, ఇన్నర్‌ రింగ్‌రోడ్డు, కండ్రిక జంక్షన్‌, పైపుల రోడ్డు, వైవీ రావు ఎస్టేట్‌, సీవీఆర్‌ ఫ్లైఓవర్‌, కబేళా సెంటర్‌ నుంచి కుడి వైపునకు తిరిగి ఉర్మిళా నగర్‌, ఎట్కిన్‌సన్‌ కాన్వెంట్‌ రోడ్డు, గొల్లపూడి బైపాస్‌, గొల్లపూడి వై జంక్షన్‌ మీదుగా వెళ్లాలి.

ఫ హైదరాబాద్‌ నుంచి విజయవాడకు వచ్చే ఆర్టీసీ బస్సులు గొల్లపూడి వై జంక్షన్‌, స్వాతి జంక్షన్‌, కనకదుర్గా ఫ్లైఓవర్‌, రాజీవ్‌గాంధీ పార్కు, పీఎన్‌బీఎస్‌ ద్వారా డిపోలోకి వెళ్లాలి.

ఫ సిటీ బస్‌ టెర్మినల్‌ నుంచి భవానీపురం, పాల ఫ్యాక్టరీ, వైఎస్సార్‌ కాలనీ, ఇబ్రహీంపట్నం వైపు వెళ్లే ఆర్టీసీ బస్సులు పీఎన్‌బీఎస్‌ నుంచి పీసీఆర్‌, ఆర్టీసీ వై జంక్షన్‌, స్వర్ణా ప్యాలెస్‌ జంక్షన్‌, హనుమాన్‌పేట, ఏలూరు లాకులు, జీఎస్‌ రాజు రోడ్డు, సీతన్నపేట గేటు, ప్రభాస్‌ కాలేజీ, బుడమేరు వంతెన, డాబాకొట్లు, ఆంధ్రప్రభ కాలనీ, నందమూరి నగర్‌ రోడ్డు, ఇన్నర్‌రింగ్‌ రోడ్డు, వైవీ రావు ఎస్టేట్‌ సర్కిల్‌, సీవీఆర్‌ ఫ్లైఓవర్‌ మీదుగా పాల ఫ్యాక్టరీ, కబేళా సెంటర్‌, విద్యాధరపురం, ఇబ్రహీంపట్నం వెళ్లాలి.

ఫ ఇబ్రహీంపట్నం, భవానీపురం, పాల ఫ్యాక్టరీ, వైఎస్సార్‌ కాలనీ వైపు నుంచి పీఎన్‌బీఎ్‌సకు వచ్చే సిటీ బస్సులు గొల్లపూడి వై జంక్షన్‌, స్వాతి జంక్షన్‌, కనకదుర్గ ఫ్లైఓవర్‌, రాజీవ్‌గాంధీ పార్కు, పీఎన్‌బీఎస్‌ ఇన్‌గేటులోకి వెళ్లాలి.

ఫ కబేళా, పాలఫ్యాక్టరీ నుంచి పీఎన్‌బీఎ్‌సకు వచ్చే సిటీ బస్సులు పాలఫ్యాక్టరీ, చిట్టినగర్‌, సొరంగం, సితారా జంక్షన్‌, జాజినగర్‌ చర్చి జంక్షన్‌, క్రాంబే రోడ్డు, స్వాతి జంక్షన్‌, కనకదుర్గ ఫ్లైఓవర్‌, రాజీవ్‌గాంధీ పార్కు, పీఎన్‌బీఎ్‌సకి వెళ్లాలి.

ఫ ఇంద్రకీలాద్రి ఘాట్‌రోడ్డు నుంచి కుమ్మరిపాలెం వైపు ఎలాంటి వాహనాల రాకపోకలను అనుమతించరు.

ఫ కనకదుర్గా ఫ్లైఓవర్‌ కింద నుంచి రహదారిపై రాకపోకలు సాగించే వాహనదారులు కనకదుర్గ ఫ్లైఓవర్‌, సొరంగం మార్గాల ద్వారా భవానీపుం వైపునకు వెళ్లాలి.

ఫ తాడేపల్లి-విజయవాడ-తాడేపల్లి వైపు ప్రకాశం బ్యారేజీ మీదుగా ఎలాంటి వాహనాలను అనుమతించరు.

ఫ ఈ మార్గంలో రాకపోకలు సాగించే సచివాలయం, హైకోర్టు ఉద్యోగులు వారధి వైపు నుంచి వెళ్లాలి.

వాహనాల నిలుపుదల ఇక్కడ

భవానీ దీక్షల విరమణకు వివిధ రాష్ట్రాలు నుంచి వచ్చే భక్తుల వాహనాలకు పార్కింగ్‌ ప్రదేశాలను కేటాయించారు. మొత్తం ఎనిమిది స్థలాలను ఎంపిక చేశారు.

ఫ విజయవాడ నగరం నుంచి ఇంద్రకీలాద్రికి వెళ్లే భక్తుల కార్లు వన్‌టౌన్‌లోని గాంధీజీ మున్సిపల్‌ ఉన్నత పాఠశాలలో నిలుపుకోవాలి.

ఫ హైదరాబాద్‌, జగ్గయ్యపేట, తిరువూరు ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల బస్సులను పున్నమిఘాట్‌, భవానీఘాట్‌, సుబ్బారాయుడి ఖాళీ స్థలంలో పార్కింగ్‌ చేయాలి.

ఫ విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం, ఉభయగోదావరి, కాకినాడ జిల్లాల నుంచి భక్తులు బస్సులను సితార సెంటర్‌ వద్ద ఉన్న పాత సోమా కంపెనీ స్థలంలో నిలుపుకోవాలి.

ఫ మచిలీపట్నం, గుడివాడ, అవనిగడ్డ నుంచి వచ్చే బస్సులు, కార్లు బీఆర్టీఎస్‌ రోడ్డులో పార్కింగ్‌ చేసుకోవాలి.

ఫ గుంటూరు, ప్రకాశం, రాయలసీమ జిల్లాల నుంచి వచ్చే భవానీ భక్తులు బస్సులు, మినీ వ్యాన్‌లను వారధి జంక్షన్‌ వద్ద ఉన్న ఉడా ఖాళీ స్థలంలో నిలుపుకోవాలి.

ఫ గుంటూరు, ప్రకాశం, రాయలసీమ జిల్లాల నుంచి వచ్చే టాటా మ్యాజిక్‌, కార్లను కృష్ణలంక సర్వీసు రోడ్డులోని ఎం హోటల్‌ నుంచి నల్లగేటు వరకు నిలుపుకోవచ్చు.

ఫ హైదరాబాద్‌ వైపు నుంచి భక్తులతో వచ్చే టూరిస్టు బస్సులు పున్నమి, భవానీ ఘాట్‌ల్లో పార్కు చేసుకోవాలి.

ఫ విశాఖపట్నం వైపు నుంచి వచ్చే టూరిస్టు బస్సులు రామవరప్పాడు రింగ్‌, ఇన్నర్‌రింగ్‌రోడ్డు, పైపుల రోడ్డు, వైవీ రావు ఎస్టేట్‌, సీవీఆర్‌ ఫ్లైఓవర్‌, సితార జంక్షన్‌ మీదుగా ఆర్టీసీ వర్క్‌షాపునకు చేరుకోవాలి. అక్కడ పాత సోమా కంపెనీ స్థలంలో వాటిని నిలుపుదల చేయాలి.

Updated Date - 2022-12-15T00:55:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising