ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గన్నవరం విమానాశ్రయంలో భద్రత కట్టుదిట్టం

ABN, First Publish Date - 2022-07-04T06:21:11+05:30

గన్నవరం విమానాశ్రయంలో భద్రత కట్టుదిట్టం

అధికారులతో మాట్లాడుతున్న కృష్ణాజిల్లా కలెక్టర్‌ రంజిత్‌ బాషా
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నేడు ప్రధాని నరేంద్రమోదీ రాక

ఎయిర్‌పోర్టు నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో భీమవరానికి.. 

మధ్యాహ్నమే తిరుగు ప్రయాణం

1,100 మందితో పోలీస్‌ బందోబస్తు

ఏర్పాట్లు పరిశీలించిన కృష్ణాజిల్లా కలెక్టర్‌



గన్నవరం, జూలై 3 : ప్రధాని నరేంద్రమోదీ రాక సందర్భంగా గన్నవరం ఎయిర్‌పోర్టులో భద్రత కట్టుదిట్టం చేశారు. సుమారు 1,100 మంది పోలీసులు బందోబస్తు విధుల్లో పాల్గొననున్నారు. ఈ మేరకు కృష్ణాజిల్లా కలెక్టర్‌ రంజిత్‌ బాషా, జాయింట్‌ కలెక్టర్‌ వావిరాల మహేశ్‌కుమార్‌ ఆదివారం గన్నవరం ఎయిర్‌పోర్టులో ఏర్పాట్లను పరిశీలించారు. సెక్యూరిటీ చెక్‌ పాయింట్‌, వీఐపీ లాంజ్‌, ఎమ్మిగ్రేషన్‌ విభాగాలను తనిఖీ చేశారు. ప్రధాని నరేంద్రమోదీ సోమవారం ఉదయం 10.10 గంటలకు ప్రత్యేక విమానంలో గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారని చెప్పారు. ప్రధానికి రాష్ట్ర గవర్నర్‌, సీఎం స్వాగతం పలుకుతారని చెప్పారు. 10.15 గంటలకు ప్రత్యేక హెలికాప్టర్‌లో ప్రధానితో పాటు గవర్నర్‌, సీఎం భీమవరం వెళ్తారన్నారు. మధ్యాహ్నం 1.05 గంటలకు భీమవరం నుంచి తిరిగి గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారని, అనంతరం ప్రత్యేక విమానంలో బయల్దేరి అహ్మదాబాద్‌ వెళ్తారని చెప్పారు. ప్రధాని పర్యటన విధుల్లో పాల్గొనే ప్రతి ఒక్కరూ కొవిడ్‌ టెస్ట్‌ తప్పనిసరిగా చేయించుకోవాలన్నారు. ఎయిర్‌పోర్టు అంతా పరిశుభ్రంగా ఉంచాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎయిర్‌పోర్టు డైరెక్టర్‌ రామారావు, గుడివాడ ఆర్డీవో పద్మావతి తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2022-07-04T06:21:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising