ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కూలీల ఆటోను ఢీకొన్న వ్యాన్‌..ఐదుగురికి గాయాలు

ABN, First Publish Date - 2022-12-16T01:27:50+05:30

ఆగి ఉన్న వ్యవసాయ కూలీల ఆటోను వ్యాన్‌ ఢీకొట్టిన ఘటనలో ముగ్గురికి తీవ్ర గాయాలు, ఇద్దరికి గాయాలయ్యాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కోడూరు, డిసెంబరు 15: ఆగి ఉన్న వ్యవసాయ కూలీల ఆటోను వ్యాన్‌ ఢీకొట్టిన ఘటనలో ముగ్గురికి తీవ్ర గాయాలు, ఇద్దరికి గాయాలయ్యాయి. ఈ ఘటన మాచవరంలో గురువారం ఉదయం జరిగింది. నాగా యలంక మండలం దిండి గ్రామానికి చెందిన వ్యవసాయ కూలీలు ఆటోలో వరికోతకు వి.కొత్తపాలెం వస్తుండగా మాచవరం వద్ద టీ తాగేందుకు ఆటోను ఆపారు. నెల్లూరు నుంచి రొయ్య పిల్లలతో వస్తున్న బొలెరో వ్యాన్‌ వెనుక నుంచి వచ్చి ఆగి ఉన్న ఆటోని ఢీకొట్టింది. ఒకరికి రెండు చోట్ల కాలు ఫ్యాక్చర్‌ కావడంతో మచిలీపట్నం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఇద్దరికి తలకు గాయాలయ్యాయి. అవనిగడ్డ ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందు తున్నారు. మరో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. వ్యాన్‌ డ్రైవర్‌ వెంక టేశ్వర్లుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ వి.రాజేంద్ర ప్రసాద్‌ తెలిపారు.

బాధితులకు జనసేన నేతల పరామర్శ

అవనిగడ్డ టౌన్‌: అవనిగడ్డ ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కూలీలను జనసేన నేతలు పరామర్శించారు. పార్టీ మండల అధ్యక్షుడు గుడివాక శేషుబాబు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

Updated Date - 2022-12-16T01:27:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising