ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అగ్నిపథ్‌ను ఉపసంహరించుకోవాలి

ABN, First Publish Date - 2022-06-30T06:27:45+05:30

అగ్నిపథ్‌ను కేంద్రం ఉపసంహరించుకోవాలని గుంటుపల్లి రైల్వే వ్యాగన్‌ వర్క్‌షాపు ఎస్‌సీఆర్‌ఎం యూ బ్రాంచ్‌ కార్యదర్శి నాగేశ్వరరావు కోరారు.

గుంటుపల్లి వ్యాగన్‌ వర్క్‌షాపు మెయిన్‌ గేట్‌ వద్ద మజ్దూర్‌ యూనియన్‌ నేతల నిరసన
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మజ్దూర్‌ యూనియన్‌ నిరసన

ఇబ్రహీంపట్నం, జూన్‌ 29 :  అగ్నిపథ్‌ను కేంద్రం ఉపసంహరించుకోవాలని గుంటుపల్లి రైల్వే వ్యాగన్‌ వర్క్‌షాపు ఎస్‌సీఆర్‌ఎం యూ బ్రాంచ్‌ కార్యదర్శి నాగేశ్వరరావు కోరారు.  గుంటుపల్లి వ్యాగన్‌ వర్క్‌షాపు మెయిన్‌ గేట్‌ వద్ద బుధవారం మజ్దూర్‌ యూనియన్‌ నేతలు, కార్మికులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా నాగేశ్వరరావు మాట్లాడుతూ నిరుద్యోగులకు శాశ్వత ఉద్యోగాలు కల్పించాలి కానీ, నాలుగుసంవత్సరాలు ఉద్యోగాలు రక్షణశాఖలో కల్పించి బయటకు పంపితే, తరువాత వారి పరిస్థితి ఏమిటన్నారు.  ప్రైవేటు పారిశ్రామిక సంస్థల వద్ద సెక్యూరిటీ గార్డులుగా పనికి వస్తారు తప్పి మరోకిటి లేదన్నారు.  రైల్వే కార్మికులకు పాత పెన్షన్‌ విధానాన్ని కొనసాగించాలన్నారు. జోనల్‌ వర్కింగ్‌ కమిటీ మెంబర్‌ అక్కల శ్రీనివాసరావు, ఏడీసీ కె.రామయ్య, బ్రాంచ్‌ చైర్మన్‌ టి.సుబ్బారెడ్డి, కె.సురేష్‌, సి.హెచ్‌.ఆనంద్‌బాబు, డి.బాబు, డి.వేణుబాబు, పి.శేషగిరిరావు, కె.వి.ఎం.జి.కృష్ణ, ఏలియారాజ్‌ పాల్గొన్నారు.


Updated Date - 2022-06-30T06:27:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising