ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సీఎం రాజీనామా చేయాలి

ABN, First Publish Date - 2022-03-05T05:57:42+05:30

రాజధానిపై కోర్టు ఇచ్చిన తీర్పు వైసీపీ ప్రభుత్వానికి చెంపపెట్టని, సీఎం జగన్‌మోహనరెడ్డి రాజీనామా చేయాలని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర డిమాండ్‌ చేశారు.

బందరులో కొల్లు, కొనకళ్ల, తదితరులు అంబేద్కర్‌ విగ్రహానికి పాలాభిషేకం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మాజీ మంత్రి కొల్లు రవీంద్ర , మాజీ ఎంపీ కొనకళ్ల

మచిలీపట్నం టౌన్‌ , మార్చి 4 : రాజధానిపై కోర్టు ఇచ్చిన తీర్పు వైసీపీ ప్రభుత్వానికి చెంపపెట్టని,  సీఎం జగన్‌మోహనరెడ్డి రాజీనామా చేయాలని మాజీ మంత్రి  కొల్లు రవీంద్ర డిమాండ్‌ చేశారు. మచిలీపట్నంలో అంబేడ్కర్‌ విగ్రహానికి శుక్రవారం  రవీంద్ర, మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణరావు పాలాభిషేకం చేశారు. అనంతరం రవీంద్ర మీడియాతో మాట్లాడుతూ 807 రోజులు పోరాటం చేసి అమరావతి రైతులు చరిత్ర సృష్టించారన్నారు. న్యాయస్థానం టూ దేవస్థానం రైతుల పాదయాత్రకు ఆటంకాలు సృష్టించి వైసీపీ పాలకులు రాక్షస ఆనందం పొందారన్నారు. న్యాయస్థానం తీర్పుతోనైనా అమరావతి రైతులపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలన్నారు. కేంద్రం అమరావతి రాజధాని కోసం ఇచ్చిన నిధులను సత్వరమే సక్రమంగా వైసీపీ పాలకులు వెచ్చించి అమరావతి రాజధానిని నిర్మించాలన్నారు. కొనకళ్ళ మాట్లాడుతూ, ఇప్పటికైనా జగన్‌రెడ్డి మూడు రాజధానులంటూ మొండి వైఖరి విడనాడి ఐదు కోట్ల ప్రజల ఆకాంక్ష అయిన అమరావతిని అభివృద్ధి చేయాలని కోరారు. కార్యక్రమంలో తెలుగు రైతు రాష్ట్ర అధికార ప్రతినిధి గొర్రెపాటి గోపీచంద్‌,  ఎం.డి.ఇలియాస్‌ పాషా, పిప్పళ్ళ వెంకట కాంతారావు, కట్టా అంజిబాబు, లంకిశెట్టి నీరజ, పాలపర్తి పద్మజ, చిట్టూరి యువరాజు, పి.వి. ఫణికుమార్‌, బత్తిన దాసు, ఎన్‌.వసంతకుమారి  పాల్గొన్నారు. అనంతరం స్వీట్లు పంపిణీ చేశారు.


Updated Date - 2022-03-05T05:57:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising