కన్నబిడ్డలే నడిరోడ్డుపై వదిలేశారు
ABN, First Publish Date - 2022-12-16T01:36:08+05:30
తండ్రికి వృద్ధాప్యం వచ్చిందని కన్నబిడ్డలే నడిరోడ్డు మీద వదిలేసి వెళ్లడంతో, దిక్కుతోచని స్థితిలో ఎటు వెళ్లాలో తెలియక ఇబ్బంది పడుతున్న ఆ వృద్ధుడికి జనసేన నాయకుడు రామకృష్ణ(ఆర్కే) ఆహారం అందించి నిరాశ్రయుల వసతిగృహానికి తరలించారు.
వృద్ధుడిని నిరాశ్రయుల గృహంలో చేర్చిన జనసేన నేత ఆర్కే
గుడివాడ: తండ్రికి వృద్ధాప్యం వచ్చిందని కన్నబిడ్డలే నడిరోడ్డు మీద వదిలేసి వెళ్లడంతో, దిక్కుతోచని స్థితిలో ఎటు వెళ్లాలో తెలియక ఇబ్బంది పడుతున్న ఆ వృద్ధుడికి జనసేన నాయకుడు రామకృష్ణ(ఆర్కే) ఆహారం అందించి నిరాశ్రయుల వసతిగృహానికి తరలించారు. హృదయ విదారకమైన ఈ ఘటన గుడివాడ నెహ్రుచౌక్ సెంటర్‌లో జరిగింది. రెండు రోజులుగా చూపు సరిగ్గా కనిపించక చలిలో వణుకుతూ తీవ్ర ఇబ్బందులు పడుతున్న వృద్ధు డిని స్థానికులు గమనించారు. విజయవాడ ప్రాంతానికి చెందిన తనకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలున్నారని, వృద్ధాప్యంలో ఉన్న తనని ఇప్పుడే వస్తామని వదిలేసి వెళ్లారని, వారి కోసం వేచి చూస్తున్నా నని ఆయన తెలపడంతో స్థానికులు జనసేన నాయకుడు మాచర్ల రామకృష్ణకు సమాచారం అందించారు. ఆర్కే ఆహారం అందించి, నిరాశ్రయుల వసతి గృహానికి తరలించారు.
Updated Date - 2022-12-16T01:36:09+05:30 IST