ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టీడీపీని అధికారంలోకి తీసుకురావాలి

ABN, First Publish Date - 2022-12-15T01:30:42+05:30

రానున్న రోజుల్లో టీడీపీని అధికారంలోకి తీసుకువచ్చి మరల చంద్రబాబు నాయు డును సీఎం చేయడానికి, పార్టీ అభివృద్ధికి పనిచేస్తున్న తెలుగు మహిళలకు తన వంతు పూర్తి సహకారమందిస్తానని టీడీపీ సీనీయర్‌ నాయకుడు కేశినేని శివనాధ్‌ (చిన్ని)అన్నారు. మొగల్రాజపురంలోని తన కార్యాలయంలో బుధవారం సెమీ క్రిస్మస్‌ వేడుకలను ఘనంగా నిర్వహించారు.

క్రిస్మస్‌ కేకు కట్‌ చేస్తున్న కేశినేని శివనాథ్‌ (చిన్ని)
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విద్యాధరపురం, డిసెంబరు 14 : రానున్న రోజుల్లో టీడీపీని అధికారంలోకి తీసుకువచ్చి మరల చంద్రబాబు నాయు డును సీఎం చేయడానికి, పార్టీ అభివృద్ధికి పనిచేస్తున్న తెలుగు మహిళలకు తన వంతు పూర్తి సహకారమందిస్తానని టీడీపీ సీనీయర్‌ నాయకుడు కేశినేని శివనాధ్‌ (చిన్ని)అన్నారు. మొగల్రాజపురంలోని తన కార్యాలయంలో బుధవారం సెమీ క్రిస్మస్‌ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మహిళా కార్యకర్తలు, నాయకులతో మాటా మంతీ నిర్వహించారు. అందరితోనూ ఆప్యాయంగా మాట్లాడారు. కేక్‌ కట్‌ చేసి పంచారు. కానుకల కిట్లను పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, పార్టీ అభివృద్ధికి నిరంతరం పనిచేస్తున్న మహిళలకు ఆయన అభినం దనలు తెలిపారు. రానున్న రోజుల్లో పార్టీ పటిష్టత కోసం, అధికారంలోకి రావడం కోసం తెలుగు మహిళలు చేస్తున్న కృషి శ్లాఘనీయమన్నారు. తెలుగు మహిళా కమిటీలు వేయడం తదితర కార్యక్రమాలకు తన పూర్తి మద్దతు ఉంటుందని, చంద్ర బాబు నాయుడును సీఎంగా చేసే లక్ష్యంతో పనిచేయడం ముదావహమన్నారు. ఎన్‌టీ ఆర్‌ జిల్లా తెలుగు మహిళ అధ్యక్షురాలు చెన్నుపాటి ఉషారాణి, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఎస్‌కే ఆషా, నందకుమారి, మాదల రాజ్య లక్ష్మి, సయ్యద్‌ గౌస్య, బేబీ సరోజని, రుక్మిణి, గరిమెళ్ల రాధిక తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-15T01:30:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising