ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రజకులను గ్రామం నుంచి బహిష్కరించినా స్పందించరా?

ABN, First Publish Date - 2022-10-07T06:08:23+05:30

శ్రీకాకుళంలో రజకుల గ్రామబహిష్కరణపై అనంతపురంలోని రజక కార్పొరేషన్‌ చైర్మన్‌ మీసాల రంగన్న కనీసం స్పందించకపోగా టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడును విమర్శించడం సిగ్గుచేటని టీడీపీ రాష్ట్ర రజక సాధికారిక కమిటీ కన్వీనర్‌ గుర్రపుసాల రామకృష్ణ విమర్శించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

టీడీపీ రాష్ట్ర రజక సాధికారిక కమిటీ కన్వీనర్‌ రామకృష్ణ 

విద్యాధరపురం, అక్టోబరు 6 : శ్రీకాకుళంలో రజకుల గ్రామబహిష్కరణపై అనంతపురంలోని రజక కార్పొరేషన్‌ చైర్మన్‌ మీసాల రంగన్న కనీసం స్పందించకపోగా టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడును విమర్శించడం సిగ్గుచేటని టీడీపీ రాష్ట్ర రజక సాధికారిక కమిటీ కన్వీనర్‌ గుర్రపుసాల రామకృష్ణ విమర్శించారు. గురువారం నగరంలోని టీడీపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మూడున్నరేళ్లలో రజకులపై అనేక దాడులు జరిగాయని, వాటి గురించి కార్పొరేషన్‌ పట్టించుకోలేదన్నారు. అచ్చెన్నాయుడు, ఎర్రన్నాయుడు, వారి కుటుంబాల సేవలు మరువలేనివన్నారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి భీమవరపు సుబ్బారావు మాట్లాడతూ వైసీపీ నేతలు ప్రతిదానికీ టీడీపీ నేతలను విమర్శించడం పరిపాటైందన్నారు. బీసీ సెల్‌ కార్యనిర్వాహక కార్యదర్శి కొండపల్లి రవి మాట్లాడుతూ శ్రీకాకుళంలో రజకుల బహిష్కర అంశంపై అచ్చెన్నాయు డు, కొల్లు రవీంద్ర, దువ్వారపు రామారావు పరిష్కరించారని, వైసీపీకి చెందిన యు వశ్రీని గ్రామస్థులు నిర్భంధిస్తే ఆమెను విడిపించింది కూడా అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్రలేనని గుర్తుంచుకోవాలన్నారు. వల్లూరు మఽధుసూదనరావు పాల్గొన్నారు.

Updated Date - 2022-10-07T06:08:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising